Capgemini News: ప్రపంచానికి ఐటీ సేవలను ఎగుమతి చేసే అగ్రగామి కంపెనీల జాబితాలో ఇండియా స్థానం ఇప్పటికీ సుస్థిరంగానే ఉంది. కంపెనీలు సైతం తమ ఉద్యోగులను రివార్డ్ చేసేందుకు సరికొత్త పద్ధతులతో ముందుకు రావటంపై టెక్కీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ తమకు మంచి రోజులు తిరిగి వచ్చాయని వారు భావిస్తున్నారు.
ఇప్పటికే ఇండియన్ సిలికాన్ వ్యాలీగా బెంగళూరు పేరొందటంతో అనేక కంపెనీలు అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ కూడా బెంగళూరుతో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సైతం రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. మరో పక్క ఏపీ ఐటీ మంత్రి నారాలోకేష్ కూడా కొత్త పెట్టుబడులను రాబట్టేందుకు తమ పాత పరిచయాలను వినియోగిస్తున్నారు.

భారత్‌లో జీసీసీ కంపెనీలు ఎక్కువగా రావడంతో ఐటీ సేవల రంగం ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందన్న అభిప్రాయం ఉంది. అయితే ఇది ఆరోగ్యకరమైన మార్పుగా ఐటీ ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశీయ కంపెనీలు సైతం తమ టాలెంట్ పూల్ కొనసాగేలా చూసుకునేందుకు వేతన పెంపులు, అధిక వేతన ప్యాకేజీలు, వేరియబుల్ పే పెంపులు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్రెంచ్ కేంద్రంగా భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్ దిగ్గజం క్యాప్‌జెమినీ తన 1.7 లక్షల మంది ఉద్యోగులకు పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తోంది. టెక్ దిగ్గజం తన ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ ప్లాన్(ESOP)ని అందుబాటులోకి తీసుకొస్తోంది.
ప్రస్తుత కాలంలో స్టార్టప్ కంపెనీలు ఎక్కువగా తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ ప్లాన్లను అందిస్తున్నాయి. దీనికి తోడు చాలా తక్కువ సంఖ్యలో ఐటీ కంపెనీలు ఇలాంటి ప్రోత్సాహకాలను ఉద్యోగులకు అందించటంతో వారిని సైతం కంపెనీలో వాటాదారులుగా మారుస్తున్నాయి. ఉద్యోగులతో కంపెనీ తన సంబంధాలను మెరుగుపరుచుకోవటంతో పాటు వారి పనితీరను ప్రోత్సహించేదిగా దీనిని కంపెనీలు వినియోగిస్తున్నాయి. ఇదే తరహాలో క్యాప్‌జెమినీ కూడా ఒక అడుగు ముందుకేసి ఉద్యోగులందరికీ తన 11వ ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్(ESOP)లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీలు కనీసం 3 నెలలు పనిచేసిన ఉద్యోగులు స్టాక్ ఆప్షన్స్ పొందేందుకు అర్హులని వెల్లడించింది.
దీనిపై కంపెనీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో టాప్ టెక్ దిగ్గజాలుగా ఉన్న విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు సైతం తమ ఉద్యోగులకు ఇలాంటి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలనే డిమాండ్ కూడా టెక్కీల నుంచి వినిపిస్తోంది. వాస్తవానికి ఇది వారి పనితీరును మెరుగుపరచటానికి సైతం దోహదపడుతుందని వారు అంటున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications