IT Hirings: కొత్త ఏడాదిలో ఉద్యోగాలు వస్తాయనే ఆశలు చాలా మందిలో చిగురిస్తున్నాయి. ప్రధానంగా ఇంజనీరింగ్, ఐటీ గ్రాడ్యుయేట్లు చాలా కాలం నుంచి ఉద్యోగ అవకాశాల కోసం వేచి చూస్తున్నారు.
టెక్ స్టాఫింగ్ & సొల్యూషన్స్ ప్రొవైడర్ సంస్థ టీమ్ లీజ్ డిజిటల్ కొత్త ఏడాది ఉపాధి అవకాశాలపై తన నివేదికను వెలువరించింది. కొత్త ఏడాదిలో 1.55 లక్షల మంది ఫ్రెషర్లను ఐటీ సెక్టార్ నియమించుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నివేదిక 2024 సంవత్సరంలో తాజా IT/ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల రిక్రూట్‌మెంట్ ఔట్‌లుక్ ఆధారంగా రూపొందించబడింది. అయితే గత ఏడాది కంటే ఫ్రెషర్ల నియామకాలు 2024లో తక్కువగా ఉంటాయని నివేదిక పేర్కొంది.

ప్రస్తుతం దేశంలో దాదాపు 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఐటీ, టెక్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. మార్కెట్లో నియామకాలు నిలిచిపోవటం, ఇంటెన్సిఫైడ్ స్కిల్స్ ఎవాల్యుయేషన్ మెకానిజమ్‌లు వారికి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వీరిలో కేవలం 45 శాతం మంది అభ్యర్థులు మాత్రమే అవసరమైన నైపుణ్యాల అంచనాలను అందుకోగలరని నివేదిక పేర్కొంది. ఇది నైపుణ్యాల డిమాండ్, సరఫరా మధ్య ఉన్న భారీ అంతరాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పరిస్థితిలో ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్ రేటు చాలా తక్కువగా ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి.
ఉద్యోగ వాతావరణంలో పెద్ద మార్పు వస్తోంది. BFSI, కమ్యూనికేషన్, మీడియా & టెక్నాలజీ, రిటైల్ & వినియోగదారు వ్యాపారం, లైఫ్ సైన్సెస్ & హెల్త్‌కేర్, ఇంజనీరింగ్ పరిశోధన & అభివృద్ధి వంటి నాన్-టెక్ రంగాల్లో ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజా వేతనాలు రూ.3-5 లక్షల మధ్య ఉండనున్నాయి.
ఐటీ సెక్టార్‌లో హైరింగ్ ల్యాండ్‌స్కేప్‌లో వచ్చిన మార్పులు ప్రస్తుత గ్రాడ్యుయేట్లకు కొత్త కష్టాలను కలిగిస్తోంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మెథడాలజీలు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్‌లో సాంకేతిక నైపుణ్యంతో కూడిన కమ్యూనికేషన్, సమస్య పరిష్కారం, టీమ్‌వర్క్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, హార్డ్ స్కిల్స్ వంటి సాఫ్ట్ స్కిల్స్ కలయిక కోసం కంపెనీలు వెతుకుతున్నట్లు నివేదిక హైలైట్ చేసింది. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వాల సంయుక్త కృషి మరింత సమగ్రమైన పాఠ్యాంశాలను రూపొందించాల్సిన అవసరం ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications