IT Layoffs: కాలం కరిగిపోతోంది టెక్ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అలుముకున్న వ్యాపార, ఆర్థిక అనిశ్చితుల కారణంగా టెక్ పరిశ్రమలో తొలగింపులు ముదిరిపాకాన పడుతున్నాయి. 2023 నుంచి లేఆఫ్స్ తీవ్రతరం అయ్యాయి.
కొత్త ఏడాది 2024లోనూ టెక్ పరిశ్రమలో తొలగింపులు కొనసాగుతున్నాయి. గూగుల్, అమెజాన్, మెటా నుంచి ఇంటెల్ వరకు అనేక టెక్ ఆధారిత కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగుల కోతలను ప్రకటించాయి. ఇప్పటి వరకు 186 టెక్ కంపెనీలు 49,386 మంది ఉద్యోగులను తొలగించాయి. కొత్త ఏడాదిలో గత నెల టెక్ లేఆఫ్స్ కొంత నెమ్మదించినప్పటికీ ఇప్పటికీ అనేక కంపెనీల్లో తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కంపెనీలు ఎప్పుడు తమపై వేటు వేస్తాయో అనే భయంతో లక్షల మంది టెక్కీలు రోజులు గడుపుతున్నారు.

ప్రధానంగా ఆదాయాలు క్షీణించి, ప్రాజెక్టులు తగ్గిన సమయంలో చాలా టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాలను పునర్నిర్మాణంలో భాగంగా ఖర్చులను తగ్గించుకోవటంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. చాలా కంపెనీలు కొత్త ప్రొడక్ట్స్ నిర్మాణం వంటి ఆలోచనలను పక్కనపెడుతున్నాయి. ఇదే క్రమంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తైతే చేతిలో సరిపడా ఆదాయాలను అందించే కొత్త డీల్స్ పైప్‌లైన్ లేకపోవటంతో అనేక మందిని ఇప్పటికే బెంచ్ పై ఎలాంటి పని లేకుండా కొనసాగిస్తున్నాయి. దీంతో బయట కొత్త ఉద్యోగ అవకాశాలు సైతం లేకపోవటంతో చాలా మంది ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు.
మరో పక్క ఏఐ కొత్త పుంతలు తొక్కుతూ ఉద్యోగుల ఆవస్యకతను క్రమంగా తగ్గిస్తుండటం చాలా కంపెనీలను తక్కువ ఖర్చులో ఆకట్టుకుంటోంది. ఐబీఎమ్ లాంటి కంపెనీలు సైతం ఉద్యోగుల స్థానంలో ఏఐ వినియోగించాలనుకోవటం పెద్ద ముప్పుకు దారితీసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ భారత ఐటీ కంపెనీలకు ప్రధాన మార్కెట్లుగా ఉన్న అమెరికా, యూకేలలో ఆర్థిక మాంద్యం భయాలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.
వ్యాపారంలో నష్టాలు,టెలికమ్యూనికేషన్ లో మందగించిన డిమాండ్ తో ఐటీ కంపెనీ సిస్కో దాని 4,250 మంది ఉద్యోగులకు ఫిబ్రవరిలో స్వస్తి పలికింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు సైతం టెక్ కంపెనీల్లో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications