HCLTech News: ఉద్యోగులపై కఠినంగా హెచ్‌సీఎల్.. TCS దారిలోనే తానుకూడా..
HCLTech: దేశంలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు పండక్కి ముందే వరుస షాకులు ఇస్తున్నాయి. ఒకపక్క ఉద్యోగ నియామకాలు దాదాపు నిలిపివేసిన టెక్ కంపెనీలు మరోపక్క ఉన్న ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
దేశంలోని ప్రధాన ఐటీ సేవల కంపెనీలు ప్రస్తుతం ఆఫీస్‌మోడ్‌లోకి మైగ్రేట్ అవుతున్నాయి. గతంలో హైబ్రిడ్ అన్న కంపెనీలు ఇప్పుడు రోజూ ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి. ముందుగా దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులను ఆఫీసులకు రావటం తప్పనిసరి చేసింది. ఆ తర్వాత అదే దారిలో ఇన్ఫోసిస్ కూడా ఉంది.

తాజాగా టాప్-5 ఐటీ కంపెనీగా ఉన్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తన ఉద్యోగులను వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఉద్యోగులు నిరంతరం ఆఫీసులకు దూరంగా ఉంటూ పనిచేయటం మంచిది కాదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈవో, MD సి విజయకుమార్ పేర్కొన్నారు. ఈ మూడు రోజులు ఎలా ఉంటాయనే దానిపై కంపెనీ ఉద్యోగులకు కొంత వెసులుబాటు కల్పిస్తోందని తెలిపారు.
ఇదే సమయంలో ప్రస్తుతం హెచ్‌సీఎల్ టెక్‌కు ఇజ్రాయెల్‌లో దాదాపు 130 మంది ఉద్యోగులు ఉన్నారని, వారందరూ సురక్షితంగా ఉన్నారని విజయకుమార్ చెప్పారు. తాము ఇజ్రాయెల్‌లో ఎలాంటి వ్యాపారం చేయటం లేదని, అయితే సాఫ్ట్‌వేర్ టీమ్‌లలో కొన్ని అక్కడ ఉన్నాయని స్పష్టం చేశారు. తాము పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అదృష్టవశాత్తూ వారంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు.
కరోనా తర్వాత క్రమంగా పరిస్థితులను టెక్ కంపెనీలు తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. దీంతో వారు 'వర్క్ ఫ్రమ్ హోమ్' సంస్కృతికి ముగింపు పలుకుతున్నారు. ప్రస్తుతం టీసీఎస్ తన 6.14 లక్షల మంది ఉద్యోగులను తప్పనిసరిగా ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సిందిగా ప్రకటించింది. దీంతో ప్రస్తుతం 70 శాతం మంది ఆఫీసులకు రావటం మెుదలు పెట్టారని కంపెనీ ప్రరకటించింది.


Click it and Unblock the Notifications