IT News: ఉద్యోగుల కోతలతో టెక్ కంపెనీలు.. షాకింగ్ లేఆఫ్స్ డేటా.. పాపం..!!
IT Layoffs: టెక్ పరిశ్రమలో లేఆఫ్స్ వేవ్ కొనసాగుతోంది. వందలు వేల సంఖ్యలో కాకుండా లక్షల సంఖ్యలో ఉద్యోగులను కంపెనీ నిర్ధాక్షణ్యంగా తొలగిస్తున్నాయి. ఎంత అవసరం ఉన్నా కొత్త వారిని మాత్రం నియమించుకోవటం లేదు.
AltIndex విడుదల చేసిన డేటా ప్రకారం ఈ ఏడాది టెక్ కంపెనీలు 2.26 లక్షల మంది టెక్కీలను తొలగించాయి. గత ఏడాదితో పోల్చితే ఉద్యోగుల కోతలు 40 శాతం మేర పెరిగినట్లు నివేదిక హైలైట్ చేసింది. దీన్నిబట్టి 2023లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని స్పష్టమవుతోంది. టెక్ రంగం నుంచి మాంద్యం సంకేతాలు ఉన్నందున.. అనేక కార్యాలయాలు మూతపడ్డాయి. 2022లో టెక్ కంపెనీలు 1,64,744 మంది ఉద్యోగుల తొలగించాయి.

Layoffs.fyi ప్రకటించిన గణాంకాల ప్రకారం 2023లో ఉద్యోగాల కోతల సంఖ్య పెరిగింది. కేవలం జవవరి ఒక్క నెలలోనే 75,912 మంది టెక్కీలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఫిబ్రవరిలో 40,000 మంది.. ఆ తర్వాత మూడు నెలల కాలంలో దాదాపు 73,000 మంది తొలగించబడ్డారు. తర్వాత దాదాపు 24 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదులుకోవాల్సి రావటంతో గత వారం వరకు మెుత్తం 2,26,117 తొలగింపులు నమోదయ్యాయి.

కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా మారటంతో.. 2021 నుంచి టెక్ కంపెనీలు మూడేళ్ల కాలంలో 4 లక్షల మంది టెక్ ఉద్యోగులను తొలగించాయి. అనిశ్చిత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసు అంతరాయాలు, ఆదాయ వృద్ధి మందగించడం ఉద్యోగాల కోతలకు ఆజ్యం పోశాయి. ఈ క్రమంలో గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు తొలగింపుల్లో ముందు వరుసలో నిలిచాయి. ఈ వాతావరణంలో ఇండియన్ టెక్ కంపెనీలు హైరింగ్ ఫ్రీజ్ కొనసాగిస్తున్నాయి. ప్రాజెక్టులు లేక అధిక సంఖ్యలో ఉద్యోగులు ఖాళీగా ఉండటంతో ఆందోళన చెందుతున్నాయి.


Click it and Unblock the Notifications