layoff News: ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంపై కోట్ల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధిని పొందుతున్నారు. అయితే ఇప్పుడు వారిని కలవరపెడుతున్న అంశం పింక్ స్లిప్స్. 2024 ప్రారంభం నుంచి ఈ ధోరణి విజృంభించటం ఆందోళనకు గురిచేస్తోంది.
2024 టెక్ రంగంలో పెద్ద పీడకలను మిగిల్చింది. జనవరిలో ఇప్పటి వరకు 85 టెక్ కంపెనీల నుంచి 20,000 మందిని తొలగించారు. పరిశ్రమలోని దాదాపు 38,000 మందిని గత ఏడాది మార్చిలో తొలగించినదాని కంటే ఇది అధికం. ఈవారం ప్రముఖ సంస్థ SAP దాదాపు 8,000 మంది ఉద్యోగులను ఉద్వాసన పలకాలని భావిస్తున్నట్లు ప్రకటించింది.

మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగంలో 1,900 టెక్ ఉద్యోగులను తొలగించింది. ఫిన్‌టెక్ స్టార్టప్ బ్రెక్స్ దాని సిబ్బందిలో 20% మందిని తొలగించగా.. eBay 1,000 ఉద్యోగాలను, సేల్స్‌ఫోర్స్ దాదాపు 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగుల్లో దాదాపు 5-7 శాతం తొలగించేందుకు కసరత్తు చేస్తోంది. జొమాటో-ఆధారిత క్యూర్‌ఫిట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 120 మంది ఉద్యోగులను తొలగించింది. Swiggy తన IPOకి ముందు ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేయాలని భావించటం స్టార్టప్ కంపెనీల్లో పరిస్థితులకు అద్ధం పడుతోంది.
నెల ప్రారంభంలో గూగుల్ కంపెనీ అంతటా అనేక వందల ఉద్యోగాలను తగ్గించిందని ధృవీకరించింది. అమెజాన్ దాని ప్రైమ్ వీడియో, MGM స్టూడియోస్, ట్విచ్, ఆడిబుల్ విభాగాల్లో విస్తరించి ఉన్న వందలాది స్థానాలను తొలగించింది. యూనిటీ తన సిబ్బందిలో దాదాపు 25% మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. గేమర్‌లు ఉపయోగించే ప్రసిద్ధ సందేశ సేవను అందించే డిస్కార్డ్ దాని 17% మంది ఉద్యోగులను తొలగిస్తోంది. "లీగ్ ఆఫ్ లెజెండ్స్" మల్టీప్లేయర్ బ్యాటిల్ గేమ్ వెనుక ఉన్న వీడియో గేమ్ డెవలపర్ Riot Games తన సిబ్బందిలో 11% మందిని ట్రిమ్ చేసింది.
ఇక చైనీస్ కంపెనీల్లో సైతం ఉద్యోగుల కోతలు సర్వ సాధారణంగా మారిపోయాయి. గత ఏడాది జనవరిలో 277 టెక్నాలజీ కంపెనీలు దాదాపు 90,000 ఉద్యోగాలను తొలగించినప్పుడు తొలగింపులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం పెద్ద కంపెనీలైన ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్ నుంచి మధ్యస్థ టెక్ కంపెనీల వరకు అన్ని చోట్లా పింక్ స్లిప్స్ ఉద్యోగుల మెడకు ఉరితాడులా వేలాడుతున్నాయి.


Click it and Unblock the Notifications