IT News: Infosys, HCLTech, LTIMindtree టెక్కీలకు పెద్ద బ్యాడ్ న్యూస్.. పూర్తి వివరాలివే
Tech News: ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు తర్వాత చాలా మంది టెక్కీలు కొత్త ఉద్యోగ అవకాశలపై సంతోషంగా ఉన్నారు. కంపెనీలు సైతం రిక్రూట్మెంట్స్ తిరిగి స్టార్ట్ చేయటంతో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ సైతం మెుదలయ్యాయి. ప్రెషర్ల రిక్రూట్మెంట్లపై కూడా సానుకూల ధోరణి మార్కెట్లో మెుదలైంటి. అయితే ఇక్కడ టెక్కీలకు పెద్ద షాకింగ్ వార్త ఒకటి ఉంది.
టెక్ పరిశ్రమలో నెమ్మదిగా కొనసాగుతున్న డిమాండ్ వాతావరణం మధ్య ఖర్చులను మెరుగ్గా నిర్వహించడానికి, లాభదాయకతను కొనసాగించడానికి భారతీయ ఐటీ సేవల రంగంలోని కంపెనీలు వేతన పెంపులను ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి వాయిదా వేస్తున్నాయి. బ్రోకరేజీలు, నిపుణుల అంచనాల ప్రకారం ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్‌టిఐఎమ్, ఎల్ అండ్ టి టెక్ సర్వీసెస్ కంపెనీలు ఇదే దారిలో ఉన్నాయని వెల్లడించాయి. ప్రస్తుత ఏడాది టెక్ కంపెనీలు వేతన పెంపుల వాయిదాలు గ్లోబల్ డిమాండ్ బలహీనతలకు అద్ధం పడుతోదని నిపుణులు చెబుతున్నారు.

చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులను మూడవ త్రైమాసికం అంతకంటే ఎక్కువ కాలానికి వాయిదా వేశాయని, దీనికి మార్జిన్ల సమస్యలు ఉన్నాయని ప్రముఖ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రీ-ఎర్నింగ్స్ నోట్‌లో వెల్లడించింది. ఇదే క్రమంలో మార్జిన్లు వరుసగా 25 బేసిస్ పాయింట్లు పెరగవచ్చని జెఫరీస్ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్, విప్రో, ఎల్‌టిఐమిండ్‌ట్రీ, హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా 20-110 బేసిస్ పాయింట్ల మార్జిన్ పెరుగుదలను నివేదించవచ్చని అంచనా వేయగా.. దిగ్గజం టీసీఎస్, కోఫోర్జ్ 30-110 బేసిస్ పాయింట్ల మేర మార్జిన్ల తగ్గుదలను నివేదించవచ్చని జెఫరీస్ వెల్లడించింది.
ఇదే క్రమంలో ఐటీ కంపెనీల పనితీరుపై మరో బ్రోకరేజ్ నోమురా స్పందిస్తూ.. ఇన్ఫోసిస్ మార్జిన్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 21.2 శాతం త్రైమాసికంలో మెరుగుపడుతుందని అంచనా వేసింది. ఇదే క్రమంలో HCLTech భారీ 120 బేసిస్ పాయింట్ల మార్జిన్ మెరుగుదలని వరుసగా 18.3 శాతానికి నివేదిస్తుంది. అలాగే Coforge వేతనాల పెంపుదల కారణంగా రెండవ త్రైమాసికంలో 110 బేసిస్ పాయింట్ల మార్జిన్ సంకోచాన్ని చూడవచ్చని అంచనా వేయబడింది.
ప్రస్తుతం జాబ్ మార్కెట్ స్తబ్దుగా ఉందని, ఈ విషయ ఐటీ సేవల రంగంలోని కంపెనీలకు కూడా తెలుసునని నిపుణులు చెబుతున్నారు. రాజీనామాలను ప్రేరేపించే పెంపుదల లేకపోవడం గురించి కంపెనీలు ఆందోళన చెందకపోవడానికి ఇది అదనపు అంశం. అట్రిషన్ నియంత్రణలో ఉండటం, ప్రమోషన్‌లను నిలిపివేయడం వంటి అనేక ఇతర అంశాలు కంపెనీలకు పెంపుపై పట్టు సాధించేందుకు స్పష్టతనిచ్చాయని నెల్సన్‌హాల్‌లోని ప్రిన్సిపల్ రీసెర్చ్ అనలిస్ట్ గౌరవ్ పరాబ్ అన్నారు. అయితే పెద్ద కంపెనీల్లో కొన్ని డిపాట్మెంట్లలో మంచి డెలివరీ చూపిన చోట మాత్రం మంచి వేతన పెంపులు చూడవచ్చని తెలుస్తోంది. దేశంలోని టాప్-5 టెక్ కంపెనీలు దాదాపు 80 వేలకు పైగా టెక్కీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకునేందుకు ఓపెనింగ్స్ ఉన్నట్లు ప్రకటించినప్పటికీ అది అసాధ్యంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications