IT News: ఆ ఇద్దరు భారతీయుల కోసం గొడవపడ్డ గూగుల్, ఆపిల్ సీఈవోలు.. ఎందుకంటే..?
IT News: ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల మధ్య ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగం వ్యాప్తి చెందుతోంది. అయితే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు పెద్ద టెక్ కంపెనీలు రేసులో ముందు వరుసలో ఉన్నాయి. ఇది ప్రఖ్యాత యూఎస్ కంపెనీల మధ్య పెద్ద యుద్ధానికి దారితీస్తోంది.
అయితే ఈ క్రమంలో భారత్ కు చెందిన ఇద్దరు ఐఐటీ ఉద్యోగుల కోసం ఆపిల్, గూగుల్ మధ్య పెద్ద గొడవ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం.. గూగుల్‌లో ఇంజినీరింగ్, AI ఉత్పత్తి విస్తరణ VPగా ఉన్న వెంకటాచారి IIT మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. అలాగే గూగుల్‌లో విశిష్ట ఇంజనీర్ అయిన ఆనంద్ శుక్లా ఐఐటీ కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు.

దీనికి ముందు ఈ ఇద్దరు ఇంజనీర్లు 2022 చివరి వరకు ఆపిల్ కంపెనీలో పనిచేశారు. ఆపిల్ వీరు సిరి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వారు కావటం గొడవకు దారితీసింది. ఇది గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ లకు మధ్య వివాదానికి కారణమైంది. పెద్ద-భాషా నమూనాల (LLM)పై పనిచేసేందుకు గూగుల్ లో చేరటం ఉత్తమమని ఇంజనీర్లు విశ్వసించారు.
అయితే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ బృందాన్ని వ్యక్తిగతంగా ఆకర్షించారని, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఇంజనీర్లను తమ వద్ద ఉండమని ఒప్పించేందుకు ప్రయత్నించారని కొన్ని నివేదికల ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఇంజనీర్ల రాకతో ఆపిల్ వెనుకబడగా.. గూగుల్ మాత్రం తన ఏఐ బార్డ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ మాత్రం ఓపెన్ ఏఐ చాట్ జీపీటీలో పెట్టుబడులు పెట్టి రేసులో దూసుకుపోతోంది. అలాగే బింగ్, మైక్రోసాఫ్ ఆఫీస్ ఉత్పత్తుల్లో సైతం ఏఐని అనుసంధానించాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications