IT News: చాలా కాలం ఐటీ రంగంలో కొనసాగిన బూమ్ చాలా మందికి కొత్త ఉద్యోగాలను కల్పించి జీవితాలను మార్చేసింది. పల్లెల నుంచి పట్టణాల వరకు అనేక మంది టెక్ ఉద్యోగాలను నమ్ముకుని బతుకుతున్నారు.
ఈ ఇప్పుడు ఐటీ బూమ్ బబుల్ పేలుతున్నట్లు కనిపిస్తోంది. అవును ఐటీ ఉద్యోగాల్లో కొనసాగుతున్న మందగమనం ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. తాజాగా టెక్ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ విడుదల చేసిన రెండవ త్రైమాసిక ఫలితాలను గమనిస్తే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. ఈ మూడు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 16,162 మేర తగ్గింది. వరుసగా ఉద్యోగుల సంఖ్య మూడు త్రైమాసికాలుగా తగ్గటం ఆందోళనలు కలిగిస్తోంది.

ప్రధానంగా గ్లోబల్ ఎకనమిక్ ప్రతికూల పరిస్థితులు ఈ పరిస్థితులకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో అక్కడి వ్యాపారంపై భారత టెక్ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఇటీవలే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతపై తాము అప్రమత్తంగా ఉన్నామని, ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామంటూ టీసీఎస్ వంటి కంపెనీలు ప్రకటన కూడా చేశాయి. అయితే ఇక్కడ గమనించదగిన మరో విషయం ఏమిటంటే మూడు టెక్ కంపెనీల్లో క్యూ-2 అట్రిషన్ రేటు తగ్గుదలను నమోదు చేసింది. అంటే ఉద్యోగులు కంపెనీలు మారే స్పీడ్ తగ్గించారని ఇది సూచిస్తోంది.
కంపెనీల వారీగా గమనిస్తే ముందుగా దిగ్గజం టీసీఎస్‌లో అట్రిషన్ రేటు 14.9 శాతంగా ఉంది. అలాగే హెడ్ కౌంట్ 6,333 తగ్గి మెుత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985కి చేరుకుంది. ఇదే క్రమంలో ఇన్ఫోసిస్ లో అట్రిషన్ రేటు 14.9 శాతంగా ఉండగా క్యూ2లో 7,530 మంది ఉద్యోగులు కంపెనీని వీడారు. చివరిగా టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్సీఎల్ టెక్నాలజీస్ లో అట్రిషన్ రేటు 14.2 శాతంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో కంపెనీ మెుత్తం ఉద్యోగుల సంఖ్య 2299 తగ్గి 2,21,139కి చేరుకుంది. ప్రస్తుతం కంపెనీలు పెద్ద ఆర్డర్లు పొందుతున్నప్పటికీ అవి వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధికి సహాయపడతాయని బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications