Chintamaneni Prabhakar: అఫిడవిట్ ఫైల్ చేసిన చింతమనేని.. ఆయన ఆస్తుల విలువ ఎంతంటే..??

Loksabha Elections 2024: ఏపీ రాజకీయాల్లో సంచలన నేతగా గుర్తుంచుకోదగిన వ్యక్తుల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఒకరు. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ నేడు ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు.

2009లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా చింతమనేని తెలుగుదేశం పార్టీ నుంచి దెందులూరు నియోజకవర్గం నుంచి ప్రత్యర్థిపై 14,235 ఓట్ల మెజారిటీతో గెలిచి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. రాజకీయాల్లో దుందుడుకుగా ఉండే ఆయనపై కేసులు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. గతంలో దాదాపు 30 కేసులు తనపై ఉన్నట్లు తెలపగా.. ఈ సారి ఎలక్షన్ అఫిడవిట్ గమనిస్తే తనపై వివిధ స్టేషన్లలో 93 కేసులు ఉన్నట్లు ప్రభాకర్ వెల్లడించారు. ఈ క్రమంలో తనపై రౌడీషీట్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

TDP Leader Chintamaneni Prabhakar mentioned in election affidavit assets 50 crores

ఇక ఆస్తుల వివరాలకు వస్తే తాజా ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చింతమనేని, అతని కుటుంబ సభ్యులు సంయుక్తంగా రూ.50 కోట్ల స్థిరచరాస్తులను కలిగి ఉన్నట్లు వెల్లడైంది. గడచిన ఐదేళ్లలో తన ఆదాయం దాదాపు రూ.1.5 కోట్లుగా ప్రభాకర్ ప్రకటించారు. ఇదే క్రమంలో భార్య వెంకట రాధారాణి ఆదాయం గడచిన 5 ఏళ్లుగా దాదాపు రూ.70 లక్షలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో కుమార్తె సాయి ప్రణీత ఆదాయం రూ.11.20 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+