Hyderabad: గుడ్ న్యూస్.. తెలంగాణలో టీసీఎస్ కొత్త క్యాంపస్.. ప్రారంభం ఎప్పుడంటే..
TCS: టీసీఎస్ హైదరాబాద్ లో త్వరలోనే మరో కొత్త క్యాంపస్ ప్రారంభించనుంది. ఫైనాన్సియల్ డిస్టిక్ట్ వద్ద మరో 6 నెలల్లో ప్రాంగణం అందుబాటులోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. గతంలో హైదరాబాద్ కింద 4000 మంది ఉద్యోగులు ఉండగా.. కానీ ఇప్పుడు మెుత్తంగా 90,000 మంది పనిచేస్తున్నారని ఏపీ, తెలంగాణ రీజినల్ హెడ్ రాజన్న వెల్లడించారు. టీసీఎస్‌కు హైదరాబాద్ డెవలప్‌మెంట్ సెంటర్ రెండో అతిపెద్ద కేంద్రమని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్ కేంద్రంగా..
ఏడాది కాలంలో కంపెనీ దాదాపు 10,800 మంది ఉద్యోగులను నియమించుకుంది. తాజాగా కొత్తగా అందుబాటులోకి వస్తున్న క్యాంపస్ ద్వారా 700 మందికి అవకాశం కల్పిస్తామని రాజన్న తెలిపారు. ఇక్కడి నుంచి కంపెనీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, తయారీ, రిటైల్, కమ్యూనికేషన్, పర్యాటకం, ఆతిథ్య రంగాలకు చెందిన 1300 మంది ఖాతాదారులకు సేవలను అందిస్తోంది.

ఆఫర్ లెటర్ ఉంటే జాబ్..
మారుతున్న సాంకేతికతల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్సిస్తున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. కంపెనీ ఆఫర్ లెటర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని టీసీఎస్ ప్రతినిధి తెలిపారు. గడచిన ఏడాది ఇందులో భాగంగా 2100 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. 'రిమోట్ ఇంటర్న్‌షిప్' పథకాన్ని 2600 మంది విద్యార్థులు వినియోగించుకున్నారని తెలిపారు.

కొత్త సాంకేతికతలు..
కంపెనీ ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, సెమీకండక్టర్లకు సంబంధించిన టెక్నాలజీలపై హైదరాబాద్ కేంద్రం దృష్టి సారించనుంది. ఇంటెలిజెంట్ డివైజెస్, హెటిరోజెనస్ కంప్యూటింగ్, 5జీ క్లౌడ్, ఐపీ నెట్‌వర్కింగ్‌లో పరిశోధనల కోసం 75వేల చదరపు అడుగుల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు వాహనాల ఆటోమేషన్ కు సంబంధించి అటానమస్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు 1200 మంది టీసీఎస్ ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు ప్రతినిధి వెల్లడించారు.


Click it and Unblock the Notifications