నాలుగేళ్లు కష్టపడితే.. టీసీఎస్ రూ. 425 జీతం పెంచింది.. ఉద్యోగి పోస్టు వైరల్.. కంపెనీ స్పందన ఏంటంటే..
భారతదేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన వేతన పెంపుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.ఆ ఉద్యోగి తన 2024-25 అప్రైసల్ లెటర్ స్క్రీన్‌షాట్‌లను రెడ్డిట్ సబ్‌రెడిట్లో పంచుకున్నారు. TCS నాకు 4 సంవత్సరాల తర్వాత రూ.422 పెంపును ఇచ్చింది. ఇది విషపూరితమైన వాతావరణం, నేను చివరకు ఎందుకు వెళ్లిపోతున్నానో చెప్పే కథ అనే శీర్షికతో పోస్ట్ చేశాడు.
ఆ యూజర్ తన పోస్ట్‌లో TCSలో 2021లో చేరినట్లు పేర్కొంటూ నాలుగు సంవత్సరాలు ఇక్కడే ఉండి నేను తప్పు చేశాను. ఇది నా బాధ్యత. ఐటీ రంగంలో విషపూరిత వాతావరణంలో మీరు చిక్కుకున్నట్లయితే, ఇది ఒక హెచ్చరికగా పరిగణించండని రాశాడు. అతను మొదటి రెండు సంవత్సరాలను విషపూరితమైన ప్రాజెక్టులో గడిపినట్లు, మేనేజర్లు ఉద్యోగులపై అరిచి, సూక్ష్మంగా నియంత్రించారని ఆరోపించాడు. ప్రాజెక్ట్ నుంచి బయటపడటానికి అనేక స్థాయిల ఒత్తిడి ఎదుర్కొన్నాను, అవమానాలు కూడా పడ్డానని తెలిపాడు.

తరువాతి రెండు సంవత్సరాలు అభివృద్ధి సంబంధిత ప్రాజెక్టుల్లో పనిచేసినా, తాను ఆశించిన స్థాయిలో సంతృప్తి దక్కలేదని పేర్కొన్నాడు. ఎక్స్‌పోజర్ చెడు కాదు కానీ ప్రత్యేకమైనది ఏమీ లేదని చెప్పి, తనకు ప్రధాన సమస్య తగిన వేతనం లేకపోవడమే అని స్పష్టం చేశాడు. 2025 సంవత్సరానికి అప్రైసల్‌గా వచ్చిన రూ.422 నెలవారీ పెంపు గురించి మాట్లాడుతూ.. ఇది నిజంగా ఒక దెబ్బ. ఆ పెంపు కూడా ఆరు నెలల ఆలస్యంగా వచ్చింది. మేము కష్టపడతాము, ఒత్తిడి మోస్తాము కానీ ఫలితం మాత్రం ప్రయత్నానికి సరిపోలడం లేదని రాశాడు.
తన పోస్ట్‌లో ఇతర ఉద్యోగులను ఉద్దేశిస్తూ మీ విలువను తెలుసుకోండి. కొత్త విషయాలు నేర్చుకోండి. అవసరమైతే మీ నిష్క్రమణను ప్లాన్ చేసుకోండని సూచించాడు. అలాగే ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలను జాగ్రత్తగా పరిశీలించండి అని సలహా ఇచ్చాడు.
రెడ్డిట్ వినియోగదారులు ఈ పోస్ట్‌పై పెద్ద ఎత్తున స్పందించారు. ఒకరు నాకు రెండుసార్లు 12% కంటే తక్కువ పెంపు వచ్చినప్పుడు నేను కంపెనీ మార్చానని రాశారు. మరొకరు నేను 7 LPA నుండి 21 LPAకి నాలుగేళ్లలో ఎదిగాను. బాధ్యత తీసుకుంటే అది సాధ్యమేనని ప్రోత్సహించారు.మరో యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ నా మేనేజర్ ఏమీ చేయలేడు అన్నాడు. మూడు నెలల్లోనే నాకు మంచి ఆఫర్ వచ్చింది. వేచి ఉండకండి, ఇది రిక్రూట్‌మెంట్ సీజన్. దరఖాస్తు చేయండి అని సూచించాడు.
ఇక TCS కంపెనీ ఈ పోస్ట్‌పై స్పందిస్తూ వ్యక్తిగత కేసులపై వ్యాఖ్యానించబోమని పేర్కొంది. ఆ పోస్ట్‌లో పేర్కొన్న వివరాలు వాస్తవాలకు సరిపోలడం లేదు. సెప్టెంబర్ 1 నుంచి మేము ఇంక్రిమెంట్లు ప్రకటించాం. సగటు పెంపు 4.5% నుంచి 7% వరకు ఉంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి రెండంకెల ఇంక్రిమెంట్లు లభించాయని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఈ సంఘటన, ఐటీ రంగంలో జీతాల పెంపుపై ఉన్న అసంతృప్తిని మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఒక ఉద్యోగి యొక్క చిన్న పెంపు కథ, ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది. నిజమైన విలువ ఎవరు నిర్ణయిస్తారు? కంపెనీనా... లేక మనమేనా? అనే చర్చ సాగుతోంది.


Click it and Unblock the Notifications