టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ నష్టాలను చవిచూసింది. Q3 నికర లాభంలో గణనీయమైన పతనాన్ని నమోదు చేసింది. ఈ తగ్గుదలకు కారణాలు ప్రధానంగా పునర్నిర్మాణ ఖర్చులు, భారత కొత్త కార్మిక కోడ్స్ అమలు, USలో దీర్ఘకాలిక చట్టపరమైన వివాదాలకు సంబంధించిన అసాధారణ ఖర్చులు కారణమని చెప్పవచ్చు. అయితే, కంపెనీ స్థిరమైన ఆదాయ వృద్ధిని కొనసాగించింది. దీంతో పాటుగా భారీ డివిడెండ్‌ను కూడా ప్రకటించింది.
ఈ త్రైమాసికంలో TCS ఏకీకృత నికర లాభం గత సంవత్సరం రూ.12,371 కోట్లతో పోలిస్తే 14 శాతం తగ్గి రూ.10,657 కోట్లకు చేరింది. కాగా CNBC-TV18 లాంటి మీడియా సంస్థలు TCS యొక్క నిజమైన నికర లాభం ఎంత అవుతుందో ముందే అంచనా వేసారు. ఆ అంచనా రూ.12,771 కోట్లుగా ఉంది. కానీ తాజా ఫలితాల్లో నిజంగా TCS నికర లాభం రూ.10,657 కోట్లు మాత్రమే వచ్చింది. అయితే, అసాధారణ అంశాలను మినహాయించి, నికర లాభం రూ.13,438 కోట్లుగా నమోదై, ఇది 8.5 శాతం పెరుగుదలను సూచిస్తోంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే..ప్రధాన లాభం తగ్గడానికి కారణం ఒక్కసారిగా వచ్చిన ఖర్చులు అని చెప్పవచ్చు.

ఈ త్రైమాసికంలో TCS మూడు ప్రధాన అసాధారణ ఖర్చులను బుక్ చేసింది. మొదటిది, జూలై 2025లో ప్రకటించిన కార్మిక శక్తి పునర్నిర్మాణ మార్పుల కారణంగా ఉద్యోగుల తొలగింపు ప్రయోజనాలు, అనగా అసాధారణ పునర్నిర్మాణ ఖర్చులు. రెండవది, భారతదేశం కొత్త లేబర్ కోడ్స్ అమలులోకి రావడం వల్ల ఉత్పన్నమైన చట్టబద్ధ ఖర్చులు. TCS రూ.2,128 కోట్లను ఈ అదనపు ఖర్చులుగా బుక్ చేసింది, ఇందులో రూ.1,816 కోట్లు గ్రాట్యుటీ కోసం, మిగిలిన రూ.312 కోట్లు దీర్ఘకాలిక గైర్హాజరీకి. మూడవది, USలో CSC కేసుకు సంబంధించిన చట్టపరమైన బాధ్యత. కంపెనీ US అప్పీలేట్ కోర్టు నిర్ణయం తరువాత రూ.1,010 కోట్ల పరిహారం ఖర్చు, రూ.342 కోట్ల వడ్డీ ఖర్చును కూడా బుక్ చేసింది.
కార్యాచరణ ప్రాతిపదికన.. TCS స్థిరమైన మార్జిన్లు, బలమైన ఒప్పందాల వృద్ధి, స్థిరమైన నగదు ప్రవాహాన్ని నమోదు చేసింది. ఆపరేటింగ్ మార్జిన్ 25.2 శాతంగా నిలిచింది. ఈ త్రైమాసికంలో మొత్తం కాంట్రాక్ట్ విలువ (TCV) 9.3 బిలియన్ డాలర్లగా నమోదై.. ప్రపంచ సాంకేతిక వ్యయ వాతావరణం మధ్య స్థిరమైన డిమాండ్‌ను సూచిస్తుంది. TCS AI సేవలలో ప్రత్యేక ప్రగతిని చూపింది, వార్షిక ఆదాయం 1.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాల్లో AI ఆధారిత సేవల్లో కంపెనీ నిష్కర్షను చూపించింది. CEO కె కృతివాసన్ ప్రకారం.. Q3FY26లో కూడా గత త్రైమాసికంలో మొదలైన వృద్ధి కొనసాగింది.
TCS బోర్డు ఒక్కో షేరుకు రూ.57 డివిడెండ్, ప్రత్యేకంగా రూ.46 డివిడెండ్ ప్రకటించింది. రికార్డు తేదీ జనవరి 17, 2026గా, చెల్లింపు ఫిబ్రవరి 3, 2026న జరగనుంది. NSEలో ఫలితాల ప్రకటనకు ముందు TCS షేర్లు 1.1 శాతం పెరిగి రూ.3,243 వద్ద ముగిశాయి. గత సంవత్సరం షేర్ ధర 24 శాతం పడిపోవడంతో, ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.11.75 లక్షల కోట్లు. ఏదేమైనా TCS Q3FY26 ఫలితాలు అసాధారణ ఖర్చుల కారణంగా నికర లాభంలో తగ్గుదల చూపినా, స్థిరమైన ఆదాయం, బలమైన AI సేవల వృద్ధి మరియు డివిడెండ్ ప్రకటించడం వంటి అంశాలు దీర్ఘకాలంలో కంపెనీ ప్రాముఖ్యతను నిలబెట్టుకుంటాయని సూచిస్తున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications