IT News: TCS భారతదేశంలో పని చేయడానికి ఉత్తమమైన ప్రదేశం, అమెజాన్ తర్వాత: లింక్డ్ఇన్ యొక్క 2023 అగ్ర కంపెనీల జాబితా ఈ కంపెనీలు ఆధారితంగా మరియు ప్రతిభావంతులను నియమించుకునే అగ్రస్థానంలో బెంగళూరు నిలిచింది, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణే వంటి నగరాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
దేశీయ IT రంగంలో TCS అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాదికి ఇండియాలో అత్యుత్తమ వర్క్ ప్లేస్ గానూ నిలిచినట్లు ప్రొఫైషనల్ సోషల్ మీడియా లింక్డ్ ఇన్ నివేదించింది. ఈ విభాగంలో మొత్తం 25 టాప్ కంపెనీల జాబితాను విడుదల చేసింది.

ఇందులో అమెజాన్, మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. ఇక ప్రతిభావంతులను నియమించుకోవడంలో టాప్ లొకేషన్ గా బెంగళూరు నిలిచినట్లు ప్రకటించింది. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, పూణే వంటి నగరాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఎనిమిది ప్రమాణాల ఆధారంగా ఈ జాబితాను లింక్డ్ ఇన్ రూపొందించింది. ఇవి కెరీర్ పురోగతికి దారితీస్తాయని అభిప్రాయపడింది. తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఓ ఉద్యోగిని ముందుకు నడిపించగలవని తెలిపింది. ఎదిగే సామర్థ్యం, నైపుణ్యాలు పెంపుదల, సంస్థ స్థిరత్వం, బయట అవకాశాలు, కంపెనీతో అనుబంధం, లింగ వైవిధ్యం, విద్యా నేపథ్యం మరియు దేశంలో ఉద్యోగుల లభ్యత వంటి పలు ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని లిస్టు తయారు చేశారంది.
లింక్డ్ ఇన్ జాబితాలోని 25 బ్రాండ్ పేర్లలో 17 కొత్తవే ఉండటం విశేషం. ఇ-స్పోర్ట్స్ మరియు గేమింగ్ నుండి Dream11 & Games24x7 వంటి కంపెనీలు మొదటిసారిగా లిస్టులోకి వచ్చాయి. 'లింక్డ్‌ఇన్ టాప్ స్టార్టప్ లిస్ట్ ఆఫ్ ది ఇయర్'లో కూడా ఉన్న Zepto సైతం ఈ జాబితాలో 16వ స్థానాన్ని పొందగలిగింది.
ఈ టాప్ 25 కంపెనీలు ఇంజనీరింగ్, కన్సల్టింగ్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్, బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్, కస్టమర్ సక్సెస్, డిజైన్, ఫైనాన్స్ మరియు ఆపరేషన్స్ వంటి ఫంక్షన్స్ లో ప్రధానంగా పెట్టుబడులు పెడుతున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మరియు కంప్యూటర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీలకు సంబంధించిన అభ్యర్థుల కోసం IT కంపెనీలు వెతుకుతున్నట్లు లింక్డ్ ఇన్ నివేదిక వెల్లడించింది. కమర్షియల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్రోత్ స్ట్రాటజీలలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం ఫైనాన్షియల్ సెక్టార్ లోని సంస్థలు చూస్తున్నట్లు పేర్కొంది. పార్టనర్ డెవలప్‌మెంట్, ఇన్‌సైడ్ సేల్స్ లో అనుభవం ఉన్నవారి కోసం గేమింగ్ మరియు ఎడ్యుటెక్ కంపెనీల రిక్రూటర్లు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications