టాటా గ్రూప్ దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థ ఇంకా టాటా గ్రూప్ చెందిన TCS దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ. ఒకప్పుడు టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్‌లో TCS వాటా దాదాపు 75 శాతం ఉండేది, ఇప్పుడు అది దాదాపు 45 శాతానికి తగ్గింది. గత ఏడాది మార్చి చివరి నుండి TCS మార్కెట్ క్యాప్ దాదాపు 15 శాతం పడిపోగా, ఈ కాలంలో టాటా గ్రూప్ మార్కెట్ విలువ 13.3 శాతం తగ్గింది. TCS ఇప్పుడు దేశంలో మూడవ అత్యంత విలువైన కంపెనీ. ఇటీవల HDFC బ్యాంక్ TCSను అధిగమించి రెండవ స్థానాన్ని సాధించింది. ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నంబర్ వన్ స్థానంలో ఉంది.

మరోవైపు ఈరోజు TCS కంపెనీ షేర్లు మంచి జోష్'లో ట్రేడవుతున్నాయి. బిఎస్‌ఇలో 1.25 శాతం పెరిగి రూ.3,344కు చేరుకుంది. దింతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12,08,441.23 కోట్లకు చేరుకుంది. TCS 52 వారాల గరిష్ట స్థాయి చూస్తే రూ.4,585.90, గత ఏడాది జూలై 2న ఈ మార్క్ తాకింది. దీని 52 వారాల కనిష్ట స్థాయి చూస్తే రూ.3,060.25, ఏప్రిల్ 7న కంపెనీ షేర్ ఈ స్థాయికి చేరుకుంది.
బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం, టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాప్‌లో TCS వాటా 44.8 శాతానికి తగ్గింది, అంటే మార్చి 2009 తర్వాత అత్యల్పం. మార్చి 2020లో ఈ వాటా 74.4 శాతంగా ఉంది. గురువారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి TCS మార్కెట్ క్యాప్ రూ.11.94 లక్షల కోట్లు కాగా, టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.26.61 లక్షల కోట్లు. దింతో TCS షేర్లు వరుసగా ఐదు సంవత్సరాలుగా గ్రూప్‌కు నష్టాలను చవిచూశాయి.
2004లో లిస్టింగ్ అయిన తర్వాత TCS ఇంత సుదీర్ఘ కాలం పాటు ఘోరమైన ప్రదర్శన కనబరచడం ఇదే మొదటిసారి. టాటా గ్రూప్ లాభాల్లో టీసీఎస్ వాటా కూడా తగ్గింది. 2025 ఆర్థిక సంవత్సరంలో, టాటా గ్రూప్‌లోని 23 లిస్టెడ్ కంపెనీల మొత్తం లాభంలో TCS వాటా 55 శాతంగా ఉంటుందని అంచనా. FY20లో 106 శాతం, FY23లో 64 శాతంతో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో TCS నికర లాభం రూ. 48,519.8 కోట్లుగా ఉంది, అయితే గత సంవత్సరం కంటే 4.1 శాతం ఎక్కువ. ఇంకా నాలుగు సంవత్సరాలలో అత్యల్ప వృద్ధి. అదేవిధంగా, కంపెనీ నికర అమ్మకాలు కూడా 6 శాతం పెరిగాయి, ఇది కూడా నాలుగు సంవత్సరాలలో అత్యల్పం.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications