TCS: దేశ ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్తున్న వ్యాపార సమూహాల్లో టాటా గ్రూప్ ముందు వరుసలో ఉంటుంది. ఇక దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. టాప్ అంతర్జాతీయ సంస్థలకు పోటీఇస్తూ సాగిపోతోంది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాలలో TCS రికార్డు సృష్టించింది.
గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి గ్లోబల్ కంపెనీలకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ధీటుగా నిలిచింది. భారీగా ఉపాధి కల్పించడంలో వాటితో పోటీపడుతోంది. ఉద్యోగుల పరంగా ప్రపంచంలోని టాప్ 10 కంపెనీలలో ఒకటిగా పేరుగాంచింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం, TCSలో 6 లక్షల 14 వేల 795 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

సిబ్బంది పరంగా TCS కంటే ముందు వరుసలో కేవలం 5 కంపెనీలే ఉన్నాయి. అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ మరియు అమెజాన్‌లో వరుసగా 21 లక్షలు మరియు 15.41 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్‌లో 8.26 లక్షలు, యాక్సెంచర్ మరియు వోక్స్‌వ్యాగన్‌లో 7.33 లక్షలు విధులు నిర్వహిస్తున్నారు. వీటి తర్వాత అత్యధికంగా 6.14 లక్షల మందితో TCS 6వ స్థానంలో ఉంది.
ప్రపంచంలోని అతిపెద్ద IT కంపెనీలలో TCS ఒకటి. మార్కెట్ క్యాప్ పరంగా చూస్తే TCS భారతదేశంలో రెండవ అతిపెద్ద కంపెనీ. జనవరి 5 నాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ 13 లక్షల 52 వేల కోట్లు. ఇక టాప్ 100లో TCSతో పాటు ఇన్ఫోసిస్, మహీంద్రా మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా జాబితాలో ఉన్నాయి. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం, ఇన్ఫోసిస్ 3.28 లక్షలు, మహీంద్రా 2.60 లక్షలు, రిలయన్స్ 2.36 లక్షల మంది ఉద్యోగులు ఆయా కంపెనీల్లో పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications