TCS News: దేశంలోని అతిపెద్ద IT సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాల విడుదల అనంతరం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్న సిబ్బంది ఎగిరి గంతేస్తున్నారు.
మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి రెండంకెల మేర జీతం పెంచున్నట్లు TCS తెలిపింది. సిబ్బంది వర్క్ ఆధారంగా 4.5 నుంచి 7 శాతం వరకు హైక్స్ ఉండనున్నట్లు వెల్లడించింది. 'ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వార్షిక ఇంక్రిమెంట్స్ ప్రకటించినందుకు సంతోషిస్తున్నాము. అత్యుత్తమ ప్రదర్శనకారులు రెండంకెల పంపును అందుకోనున్నారు' అని చీఫ్ HR ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.

'12.5 శాతం తగ్గిన అట్రిషన్ రేటు మా క్యాంపస్ నియామకాల్లో జోష్ పెంచింది. పెరిగిన కస్టమర్ విజిటింగ్ మరియు ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావడం వల్ల మా డెలివరీ సెంటర్‌లు మునుపటి కళను సంతరించుకున్నాయి. సహచరుల్లో గొప్ప ఉత్సాహం మరియు మనోధైర్యం పెరిగింది' అని లక్కాడ్ వెల్లడించారు.
గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో TCS నియామకాలు తగ్గుముఖం పట్టాయి. దీనికితోడు సంస్థ హెడ్ కౌంట్ 1,759 మేర తగ్గింది. దీంతో గతేడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య 6.01 లక్షలకు చేరింది. కాగా ఈ సంవత్సరం దాదాపు 40 వేల మంది ఫ్రెషర్‌లను నియమించుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. చాలా మంది ఇప్పటికే ఆన్-బోర్డింగ్ ప్రక్రియలో ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications