ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బుధవారం నాటి నష్టాల నుండి కోలుకొని, సరికొత్త గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ ఉదయం నష్టాల్లో ఉంది. రెండు గంటల తర్వాత లాభాల్లోకి వచ్చిన స్టాక్స్, పైపైనే కదలాడాయి. ఒకటి రెండుసార్లు స్వల్ప నష్టాల్లోకి వచ్చినప్పటికీ, మళ్లీ వెంటనే తేరుకున్నాయి. మెటల్ సూచీ దాదాపు 1 శాతం నష్టపోయింది. ఆటో, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు పెరిగాయి. సెన్సెక్స్ 49,500ను క్రాస్ చేసింది.

సూచీలు జంప్
సెన్సెక్స్ 91.84 పాయింట్లు లేదా 0.19% లాభపడి 49,584.16 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30.70 పాయింట్లు లేదా 0.21% పెరిగి 14,595.60 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఉదయం 49,432 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 49,663 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,182 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
1467 షేర్లు లాభాల్లో, 1489 షేర్లు నష్టాల్లో ముగియగా, 166 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 11 పైసలు లాభపడి 73.04 వద్ద క్లోజ్ అయింది. ఉదయం 73.19 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో 73.15 వద్ద క్లోజ్ అయింది. నేటి సెషన్లో 72.93-73.18 మధ్య ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో UPL 3.60 శాతం, BPCL 3.59 శాతం, TCS 2.90 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.86 శాతం, IOC 2.23 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HCL టెక్ 2.68 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.72 శాతం, JSW స్టీల్ 1.63 శాతం, టెక్ మహీంద్రా 1.59 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.47 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టాటా మోటార్స్, రిలయన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.21 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.09 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.29 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.37 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.77 శాతం, నిఫ్టీ ఫార్మా 0.84 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.28 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.17 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.19 శాతం, నిఫ్టీ ఐటీ 0.14 శాతం, నిఫ్టీ మీడియా 0.23 శాతం, నిఫ్టీ మెటల్ 1.02 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.06 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.12 శాతం నష్టపోయాయి.
నిన్నటికి బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,97,66,572.66 కోట్లకు చేరుకుంది.
నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 1 శాతం లాభపడి రూ.1958 వద్ద ముగిసింది. టీసీఎస్ షేర్ అయితే 2.70 శాతం ఎగిసి రూ.3244 వద్ద క్లోజ్ అయింది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications