TCS Q2 Results: దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించింది. స్టాక్ మార్కెట్లు ముగిసిన కొద్ది సేపటి తర్వాత కంపెనీ తన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది.
సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.11,342 కోట్లుగా నమోదైంది. ఇది QoQ ప్రాతిపదికన 2.4 శాతం అధికంగా నమోదైంది. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం గత త్రైమాసికం కంటే 0.5 శాతం అధికంగా రూ.59,691 కోట్లుగా నమోదైంది. ఇదే క్రమంలో ఈబీఐటీ మార్జిన్ స్వల్పంగా పెరిగి 24.3 శాతంగా ఉంది. ఇది నిపుణుల అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో కంపెనీ షేర్ హోల్డర్లకు రూ.9 చొప్పున ఇంటెరిమ్ డివిడెండ్ ప్రకటించింది. టీసీఎస్ రెండవ త్రైమాసిక సమయంలో పెద్ద ఆర్డర్లను సాధించినప్పటికీ అవి పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయాయి. ఈరోజు టీసీఎస్ బోర్డు రూ.17,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ రూపంలో తిరిగి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో షేరుకు రూ.4,150 ధర చెల్లించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆరేళ్ల కాలంలో ఐదవ సారి కంపెనీ షేర్ బైబ్యాక్‌ను ప్రకటించింది.
మెుత్తం రెండవ త్రైమాసిక కాలంలో టీసీఎస్ 11.2 బిలియన్ డాలర్లు విలువైన డీల్స్ కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీ త్రైమాసిక వృద్ధిలో అధిక త్రైమాసికాన్ని చూసింది. ఈరోజు స్టాక్ మార్కెట్లు ముగిసే సమయంలో టీసీఎస్ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.3,613 వద్ద ముగిసింది. ప్రస్తుత ధర కంటే రూ.537 ఎక్కువ రేటుకు షేర్లను పెట్టుబడిదారుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications