దేశీయ సాఫ్టువేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) FY22 రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ ఏకీకృత నికర లాభం రూ.9,624 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం లాభం రూ.8433 కోట్లతో పోలిస్తే ఇది 14.1 శాతం అధికం. అదే సమయంలో ఏకీకృత ఆదాయం కూడా రూ.40,135 కోట్ల నుండి 16.8 శాతం వృద్ధితో రూ.46,867 కోట్లకు పెరిగింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 15.5 శాతంగా నమోదయింది.
కంపెనీ అన్ని విభాగాల్లో డబుల్ డిజిట్ వృద్ధిని సాధించింది. తయారీ విభాగంలో 21.7 శాతం, లైఫ్ సైన్సెస్ - హెల్త్ సంరక్షణలో 19 శాతం, రిటైల్, సీపీజీలో 18.4 శాతం, బ్యాంకింగ్-ఆర్థికసేవలు-బీమాలో 17 శాతం, కమ్యూనికేషన్-మీడియాలో 15.6 శాతం, టెక్నాలజీ సేవల్లో 14.8 శాతం వృద్ధి నమోదయింది. ఉత్తర అమెరికా వ్యాపారంలో 17.4 శాతం వృద్ధి నమోదు అయింది. యూకేలో 15.6 శాతం, ఐరోపాలో 13.5 శాతం వృద్ధి కనిపించగా, ఎమర్జింగ్ మార్కెట్ భారత్‌లో 20.1 శాతం వృద్ధి నమోదు చేసింది. లాటిన్ అమెరికాలో 15.2 శాతం, మద్య ప్రాచ్యం, ఆఫ్రికా 13.8 శాతం, ఆసియా పసిఫిక్ 7.6 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

కంపెనీ బోర్డు ఒక్కో షేర్‌కు రూ.7 ఇంటరిమ్ డివిడెండ్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో 52 వారాల గరిష్టస్థాయి రూ.3,990కి చేరుకుంది. అయితే క్రితం సెషన్ ముగింపు మాత్రం రూ.3,943 వద్ద ఉంది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14.5 లక్షల కోట్లను దాటింది. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ త్రైమాసికంలో నికరంగా 19,690 మందిని నియమించుకుంది. దీంతో ఉద్యోగుల సంఖ్య 5,28,748కు చేరింది. గత ఆరు నెలల్లో 43,000 మంది కొత్త గ్రాడ్యుయేట్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకుంది. ఐటీ వలసల రేటు 11.9 శాతంగా ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications