TCS News: మార్కెట్ అంచనాలను మించి టీసీఎస్ ఫలితాలు.. డివిడెండ్ ప్రకటన ఎంతంటే..
TCS Q1 Results: ప్రపంచంలోని ప్రముఖ IT సేవలు, కన్సల్టింగ్ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2024 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తన ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో కంపెనీ బలమైన పనితీరును కనబరిచింది.
TCS FY 2024 Q1 కోసం ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను నివేదించింది. తొలి త్రైమాసికంలో ఏకీకృత లాభం 16.8 శాతం పెరిగి రూ.11,074 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో నికర లాభం రూ.11,392 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం 12.5 శాతం మేర పెరిగి రూ.59,381 కోట్లుగా నమోదైంది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలు, క్లౌడ్ అడాప్షన్, వివిధ పరిశ్రమల వర్టికల్స్‌లో పటిష్టమైన డిమాండ్‌పై TCS నిరంతర దృష్టి అద్భుతమైన వృద్ధికి కారణమని తెలుస్తోంది.

ఇదే సమయంలో కంపెనీ బోర్డు ఒక్కో షేరుపై రూ.9 చొప్పున ఇంటెరిమ్ డివిడెండ్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. TCS గ్లోబల్ పనితీరుతో పటిష్టమైన వృద్ధిని అందిస్తూ ముందుకు సాగుతోంది. ఉత్తర అమెరికా మార్కెట్ కంపెనీ ఆదాయానికి ప్రధాన సహకారాన్ని అందిస్తోంది. ఇక్కడి నుంచి కంపెనీకి దాదాపు 56 శాతం ఆదాయం సమకూరుతోంది. ఇదే సమయంలో ఐరోపా మార్కెట్లో కూడా బలమైన వృద్ధిని ప్రదర్శించటంతో ఏడాది ప్రాతిపధికన ఆదాయం 18 శాతం మేర పెరిగింది. ఇదే క్రమంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతం ఆశాజనకమైన వృద్ధి సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 12-15 శాతం వేతన పెంపును అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే పెరిగిన జీతాలు ఏప్రిల్ 1 నుంచి చెల్లించబడతాయని కంపెనీ వెల్లడించింది. ఇదే సమయంలో కంపెనీ ఆపరేటింగ్ మార్జిన 23.2 శాతంగా ఉన్నట్లు సీఎఫ్ఓ వెల్లడించారు. 53% మంది వర్క్‌ఫోర్స్ ఇప్పటికే వారానికి మూడుసార్లు ఆఫీసుకు వస్తున్నట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో ఏప్రిల్-జూన్ కాలానికి తమ ఆర్డర్ బుక్ ఏడాది క్రితం 8.2 బిలియన్ డాలర్లతో పోల్చితే.. 10.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు టీసీఎస్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications