TCS News: యువ టెక్కీలకు శుభవార్త.. టీసీఎస్ హైరింగ్ ప్రకటన.. పూర్తి వివరాలు
IT News: ఈ ఏడాది కాలేజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కోసం దేశంలోని టెక్ దిగ్గజం టీసీఎస్ శుభవార్త చెప్పింది. భారతదేశపు అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2024 గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని చూస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం టెక్ కంపెనీలు హైరింగ్ నిలిపివేసిన సమయంలో ఇది భారీ ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్‌లో పనిచేయడం చాలా మందికి టెక్కీలకు ఒక కల. అయితే ఇప్పుడు ఆ కల నెరవేర్చుకునే అవకాశం వచ్చేసింది. TCS 2024 గ్రాడ్యుయేట్ల కోసం కొత్త రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. దీని ప్రకారం 2024లో బీటెక్, పీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఎస్ సహా విభాగాల్లో చదువు పూర్తిచేసే విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు విద్యార్థులు టీసీఎస్ కంపెనీ అధికారిక సందర్శించి కెరీర్‌ల విభాగంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

టీసీఎస్ ఎంపికల కోసం విద్యార్థులకు జాతీయ అర్హత పరీక్ష నిర్వహిస్తుంది. ఫలితాల ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. దీనికి దరఖాస్తు చేసేందుకు ఏప్రిల్ 10 చివరి తేదీ కాగా.. ఏప్రిల్ 26న దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. ముంబైలో ప్రధాన కార్యాలయం, TCS నింజా, డిజిటల్, ప్రైమ్ అనే మూడు విభాగాలకు రిక్రూట్ చేయాలని యోచిస్తోంది. నింజా కేటగిరీలో చేరే ఉద్యోగులకు వార్షిక వేతనం రూ.3.36 లక్షలుగా నిర్ణయించారు.
వార్షిక వేతనం డిజిటల్ కేటగిరీకి 7 లక్షల రూపాయలుగా ఉండగా.. ప్రైమ్ కేటగిరీకి 9 నుంచి 11.5 లక్షల రూపాయలుగా నిర్ణయించబడింది. ఎన్ని ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్న లెక్కలు మాత్రం కంపెనీ ప్రకటించలేదు. అయితే TCS 2023-24 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది కొత్త నియామకాలను లక్ష్యంగా ఉంచుకున్నట్లు తెలుస్తోంది. టీసీఎస్ తన బిజినెస్ ప్రాసెసింగ్ విభాగానికి విద్యార్థులను రిక్రూట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులను, కామర్స్ విద్యార్థులను తీసుకోవాలని చూస్తోంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇందుకోసం ఏప్రిల్ 14లోగా టీసీఎస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


Click it and Unblock the Notifications