TCS New Bench Policy: ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగుల కోసం కొత్త పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పాలసీ ప్రకారం ఉద్యోగులు ఏటా 225 రోజుల పాటు ప్రాజెక్టులో ఉండి తీరాలి. బెంచ్ మీద ఏడాదిలో కేవలం 35 రోజులు మాత్రమే ఉండాలని కొత్త నిబంధన తీసుకువచ్చింది. జూన్ 12 నుంచే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ నిబంధన ప్రధాన ఉద్దేశం ఉద్యోగులు ఖాళీగా ఉండకుండా పనిలో ఎక్కువ శాతం గడపడం..వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడమేనని టీసీఎస్ కంపెనీ తెలిపింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తీసుకువచ్చిన కొత్త అసోసియేట్ డిప్లాయ్‌మెంట్ పాలసీ ప్రకారం.. ప్రతి ఉద్యోగి సంవత్సరానికి కనీసం 225 బిల్ చేయబడిన పని దినాలు కలిగి ఉండాలి. అలాగే కేవలం 35 రోజుల మాత్రమే బెంచ్ మీద ఉండాలి. ఏ సమయంలోనైనా.. గత 12 నెలల్లో కనీసం 225 పని దినాలకు అసోసియేట్‌లను కేటాయించాలని టీసీఎస్ తెలిపింది. దీనర్థం ఏంటంటే..225 రోజుల పాటు ఉద్యోగి ఏదో ఓ ప్రాజెక్ట్ మీద ఉండి తీరాలి. ప్రాజెక్టుపై ఉండకుండా కేవలం ఖాళీగా 35 రోజులు మాత్రమే పరిమితి ఉంటుంది.

ఈ నిబంధనలు ఉల్లఘించిన వారికి పారితోషికం, కెరీర్ వృద్ధి, చివరకి అతని ఉద్యోగ జీవితంపైన కూడా తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి వస్తుందని కంపెనీ తెలిపింది. TCS యొక్క రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (RMG) ఈ నిబంధనను పర్యవేక్షిస్తారు. ఏ ప్రాజెక్ట్‌కు ఎవరు సరిపోతారు? ఎవరి నైపుణ్యాలు సరిపోతాయి? వంటివి ఈ గ్రూపు పరిశీలిస్తూ ఉంటుంది. ఉద్యోగులు తమను ప్రాజెక్టులో భాగం చేయమని చంద్రశేఖరన్ రామ్‌కుమార్ ని అడగాలని..వారు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండాలని టీసీఎస్ కంపెనీ తెలిపింది. అసోసియేట్‌లు నిరంతరం క్లయింట్ ప్రాజెక్టులలో నిమగ్నమై ఉన్నారని నిర్ధారించుకోవడం RMG బాధ్యతగా చెప్పుకొచ్చింది కంపెనీ.
బెంచ్‌లో ఉన్నప్పుడు ఉద్యోగి ఖాళీగా ఉండకుండా.. iEvolve, Fresco Play, VLS వంటి అంతర్గత ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొత్తవి నేర్చుకోవడానికి ప్రతిరోజూ 4 నుండి 6 గంటలు కేటాయించాలని కూడా కంపెనీ నిబంధనలో పేర్కొంది. అసోసియేట్‌లు TCS యొక్క Gen AI ఇంటర్వ్యూ కోచ్‌ను ఉపయోగించుకోవాలని తెలిపింది. ఇంటర్వ్యూ అభిప్రాయాన్ని పరిష్కరించడంతో పాటుగా పూర్తి హాజరుతో శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేయాలని తెలిపింది. ఇక నిబంధనలో బెంచ్ మీద ఉన్నప్పుడు 35 రోజుల పాటు ఆఫీసుకు వెళ్లడం తప్పనిసరి చేసింది. 225 రోజుల కన్నా తక్కువలో ప్రాజెక్టు మీద ఉన్నవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది.
బెంచ్ పీరియడ్ అంటే ఏమిటి: ఏ కంపెనీలో అయినా ఉద్యోగి ఏ ప్రాజెక్ట్ మీద పనిచేయకుండా ఖాళీగా ఉండే మొత్తం కాలాన్ని బెంచ్ పీరియడ్‌గా పేర్కొంటారు. అంటే ఉద్యోగి ఏడాదిలో ఆరు నెలలు ఖాళీగా ఉంటే ఆరు నెలల కాలాన్ని బెంచ్ పీరియడ్‌గా వ్యవహరిస్తారు. మిగతా కాలాన్ని బిల్ల్‌డ్ డేస్‌గా పరిగణిస్తారు.
బిల్ల్‌డ్ డేస్ అంటే ఏమిటి: ఏ ఉద్యోగి అయినా ప్రాజెక్టులో మొత్తం పనిచేసిన కాలాన్ని బిల్ల్‌డ్ డేస్‌గా పరిగణిస్తారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications