For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

TCS Jobs: IT జాబ్ కావాలనుకునేవారికి శుభవార్త.. TCSలో జాబ్ పొందే అవకాశం.. పూర్తి వివరాలు

|

IT Jobs: ఈ రోజుల్లో ఫెషర్లకు ఉద్యోగాలు రావటం కొంత కష్టమే. ఉద్యోగం కావాలంటే అనుభవం అడుతుంటాయి కంపెనీలు. ఇలాంటి వారికోసమే దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ దేశ వ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తోంది. దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీలో IT ఇంజనీరింగ్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం కోర్సుల్లో ఉన్న విద్యార్థులకు నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (NQT)ను నిర్వహిస్తుంది.

TCS NQT పరీక్ష విద్యార్థులకు వారి ఉద్యోగ సంసిద్ధతను నిరూపించుకునే అవకాశాన్ని అందిస్తుంది. IT పరిశ్రమలో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థుల కోసం TCS NQT కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ప్రారంభించినట్లు TCS ఇటీవల ప్రకటించింది. కంపెనీ వివరాల ప్రకారం.. 2023లో గ్రాడ్యుయేషన్ పొందిన విద్యార్థులు మాత్రమే పరీక్షకు అర్హులని స్పష్టం చేసింది. పరీక్షను వివిధ తేదీల్లో టీసీఎస్ నిర్వహిస్తోంది.

TCS నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అర్హత..

TCS నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అర్హత..

ఇంతకుముందు పేర్కొన్న వివరాల ప్రకారం.. 2023లో తమ కోర్సులను పూర్తి చేసే విద్యార్థులు మాత్రమే TCS NQT పరీక్షకు అర్హులు. దేశంలో గుర్తింపు కలిగిన ఏ యూనివర్సిటీ నుంచి అయినా విద్యార్థి చదువుతూ ఉండవచ్చు. ఏఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనడానికి అర్హులో ఇప్పుడు తెలుసుకోండి..

1. Bachelor of Technology (B.Tech.)

2. Bachelor of Engineering (B.E.)

3. Master of Technology (M.Tech.)

4. Master of Engineering (M.E.)

5. Master of Computer Applications (M.C.A.)

6. Master of Science (M.Sc. / M.S.)

TCS NQT పరీక్ష నమోదుకు చివరి తేదీ..

TCS NQT పరీక్ష నమోదుకు చివరి తేదీ..

TCS NQT కోసం నమోదు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 22గా ఉంది. పరీక్ష ఆగస్టు 15 నుంచి వివిధ తేదీల్లో నిర్వహించబడుతుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష రాయవలసిన తేదీ ముందుగానే ఇవ్వబడుతుంది.

TCS NQT కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

TCS NQT కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు TCS Next Step పోర్టల్‌లో నమోదు ద్వారా TCS NQT కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పరీక్ష కోసం సైన్ అప్ చేయడానికి పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు లేదా వారి క్రెడెన్షియల్స్ ఉపయోగించి పాత ఖాతాకు లాగిన్ చేయవచ్చు. నమోదు చేసుకునేటప్పుడు అభ్యర్థులు పరీక్ష మోడ్‌ను ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. వారు పరీక్షను ఎంపిక చేసిన కేంద్రంలో లేదా రిమోట్‌గా కూడా రాయవచ్చు. అలాగే.. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తరువాత ఎలాంటి మార్పులు అనుమతించబడవని గుర్తుంచుకోండి.

English summary

TCS Jobs: IT జాబ్ కావాలనుకునేవారికి శుభవార్త.. TCSలో జాబ్ పొందే అవకాశం.. పూర్తి వివరాలు | TCS National Qualifier Test is Chance to get job in IT industry leading tata consultancy services

know full details about TCS National Qualifier Test by job seekers in it sector..
Story first published: Wednesday, July 6, 2022, 15:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X