లేఆఫ్స్ ప్రకటన తర్వాత.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఐటీ సేవల సంస్థలలో ఒకటైన ఈ కంపెనీ ఇటీవల 12 వేల మందికి పైగా ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లగా చేసిన ప్రకటన.. కంపెనీని అత్యంత దారుణ సంక్షోభం దిశగా తీసుకువెళుతోంది. మార్కెట్‌లో ఈ వార్త వెలువడిన తరువాత నుంచి టీసీఎస్ కంపెనీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయింది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే TCS యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) రూ. 16.57 లక్షల కోట్ల నుండి కేవలం రూ. 10.93 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే రూ. 5.66 లక్షల కోట్లకు పైగా ఆస్తి విలువ హారతి కర్పూరంలా కరిగిపోయింది.పరిశీలకుల అభిప్రాయం ప్రకారం చూసుకున్నట్లయితే.. ఇది 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత TCS ఎదుర్కొన్న అతి దారుణమైన దశ అని చెబుతున్నారు. అప్పట్లో TCS షేర్ ధరలు ఏకంగా 55 శాతం వరకు పడిపోయాయి. ప్రస్తుతానికి 2025లో కంపెనీ షేర్లు ఇప్పటికే 25% వరకు పతనమయ్యాయి. ఇదే ధోరణి కొనసాగితే.. ఈ ఆర్థిక సంవత్సరం TCS చరిత్రలోనే అత్యంత కఠినమైన ఏడాదిగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.
విదేశీ పెట్టుబడిదారుల ఆలోచన కూడా ఈ పతనానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ఎగుమతులపై 50% దిగుమతి సుంకాలు ప్రకటించడంతో వాణిజ్య యుద్ధ భయాలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. దీనివల్ల గత కొన్ని నెలలుగా భారత స్టాక్ మార్కెట్లో తీవ్రమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. సాధారణంగా FIIలు (Foreign Institutional Investors) ఇష్టపడే ఐటీ రంగం, ఇప్పుడు భారీగా వాటాలు విక్రయించబడుతున్న రంగంగా మారిపోయింది.

వాస్తవానికి, FIIల వాటా TCSలో 2024 జూన్‌లో 12.35 శాతం ఉండగా.. 2025 జూన్ నాటికి 11.48 శాతానికి దిగిపోయింది. అంటే విదేశీ పెట్టుబడిదారులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడులలో అధిక మొత్తలను వెనక్కి తీసుకున్నారు. దాంతో కంపెనీ షేర్ ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇదే సమయంలో.. దేశీయ మ్యూచువల్ ఫండ్లు మాత్రం దీనికి వ్యతిరేక ధోరణిచూపుతున్నాయి. వారు TCSలో తమ వాటాను 4.25 శాతం నుండి 5.13 శాతానికి పెంచుకున్నారు అలాగే ఇటీవలే సుమారు రూ. 400 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఇది కొంతమేర స్థిరత్వాన్ని కల్పించినప్పటికీ మొత్తం బలహీన ధోరణిపై ప్రభావం చూపలేకపోయిందని చెప్పుకోవచ్చు.
ఫండమెంటల్స్ పరంగా చూస్తే, కంపెనీ యొక్క PE రేషియో 41x నుండి 20xకు తగ్గింది. ఐదేళ్ల CAGR 8.5 శాతం నుంచి, స్టాక్ CAGR 6 శాతంగా నమోదైంది. భారతదేశ ఐటీ రంగం గత రెండు దశాబ్దాలుగా సగటున 12.5 శాతం వృద్ధి నమోదు చేసింది. గత 3-5 సంవత్సరాల్లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ పనితీరు చాలా బలహీనంగా మారిపోయింది.
తాజా మీడియా నివేదికల ప్రకారం.. TCS ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులలో సుమారు 2 శాతం మందిని తొలగించాలనే ప్లాన్ చేస్తోంది. దీని వలన ఒకే ఆర్థిక సంవత్సరంలో 12 వేలకు మందికి పైగా ఉద్యోగాలు రోడ్డు మీదు వచ్చే అవకాశం ఉంది. జెఫరీస్ నివేదిక ప్రకారం.. ఈ నిర్ణయం తాత్కాలికంగా మందగమనాన్ని చూపించినప్పటికీ, దీర్ఘకాలంలో ఉద్యోగాల పరంగా మరల వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతోంది.
క్లుప్తంగా చెప్పాలంటే.. ప్రస్తుతం టీసీఎస్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటోంది. పరిస్థితి త్వరగా స్థిరపడకపోతే, ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీ చరిత్రలోనే అత్యంత దుర్భర కాలంగా మిగిలే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

TCS Q4 FY26 Results: టీసీఎస్ క్యూ4 ఎఫ్వై26 ఫలితాలు ఇవిగో.. భారీగా పెరిగిన లాభాలు..డివిడెండ్ ఎంతంటే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Layoffs: లేఆఫ్స్ నుండి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం ఇదే.. గోల్డ్మన్ సాక్స్ కీలక సూచన!

Layoffs: ఒరాకిల్ ఎందుకు ఇన్ని వేల మందిని తీసేస్తోంది? లోపల జరుగుతోంది ఇదే!

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

Layoffs: జీతం కోసం కాదు.. కేవలం ఆ ఒక్క కారణంతో 10 ఏళ్లు ఒకే కంపెనీలో! ఈ టెక్కీ కథ విన్నారా?

14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్.. టెక్ రంగాన్ని కుదిపేస్తున్న లేఆప్స్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..



Click it and Unblock the Notifications