Work From Home: దాదాపుగా రెండు సంవత్సరాలకు పైగా ఐటీ రంగంలోని చాలా మంది ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేయటానికి పరిమితమయ్యారు. అయితే ఇటీవల హైబ్రిడ్ విధానం మెుదలు పెట్టింది. ఖచ్చితంగా వారంలో మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని చెప్పింది.
మూన్ లైటింగ్ తమ సంస్థ సిద్ధాంతానికి పూర్తి విరుద్ధమైనదని కంపెనీ యాజమాన్యం ఇటీవల తొలిసారిగా స్పందిస్తూ వెల్లడించింది. ఇలా అనేక కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చిచెప్పాయి. పైగా కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదని నియామకానికి ముందుగానే చెప్పేస్తున్నాయి.

టీసీఎస్ తాజాగా తన ఉద్యోగులకు మెయిల్స్ పంపింది. ఇకపై ఎవరైనా ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని పొందాలనుకుంటే దానికి మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి అని చెప్పింది. కంపెనీ తిరిగి ఆఫీసుకు రిపోర్ట్ చేయాలని అడిగినప్పుడు ఎవరైనా ఉద్యోగి తన ఆరోగ్య కారణాలను సాకుగా చెప్పాలనుకుంటే ఇకపై అలా కుదరదు. దానికి తగిన మెడికల్ సర్టిఫికేట్ అవసరమని కంపెనీ డిమాండ్ చేస్తోంది.
ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు చెబుతున్న ఉద్యోగులను కంపెనీ తాము సెలెక్ట్ చేసిన కొందరు డాక్టర్ల వద్దకు హెల్త్ చెకప్ కోసం పంపుతోంది. వారి ద్వారా సదరు ఉద్యోగి ఆరోగ్యం నిజంగా ఆఫీసుకు వెళ్లి పనిచేయటానికి వీలుగా ఉందా లేదా అనే వాస్తవాలను నేరుగా తెలుసుకుంటోంది. ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కేసు-టు-కేస్ ఆధారంగా అనుమతించబడవచ్చని తెలుస్తోంది.

కంపెనీ ఎంప్యానెల్ చేసిన వైద్యుల బృందం నుంచి ట్రీట్‌మెంట్ అందిస్తూ.. వర్క్ ఫ్రమ్ హోమ్ దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టింది. ఉద్యోగుల పనితీరుకు సంబంధించి కంపెనీ ట్రాక్ చేస్తూనే ఉంది. వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులకు వచ్చేలా రోస్టర్ తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.


Click it and Unblock the Notifications