TCS News: టాటాలకు చెందిన భారతీయ ఐటీ దిగ్గజం దేశంలోనే కాక అగ్రరాజ్యం అమెరికాలోనూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. అమెరికాలో ఉద్యోగాలను కల్పిస్తున్న పెద్ద కంపెనీల జాబితాలో ఈ భారత సంస్థ నిలిచింది.

ఉద్యోగాల కల్పన..
గడచిన మూడేళ్లలో టీసీఎస్ దాదాపుగా 21,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంది. తాజా ఫోర్బ్స్ తన అమెరికా వార్షిక ఉత్తమ పెద్ద ఉద్యోగాల జాబితాలో టీసీఎస్ స్థానం సంపాదించింది. ఇటీవల ఫార్చ్యూన్ మ్యాగజైన్ TCSని తన 2023లో ప్రపంచంలోని అత్యంత ఆరాధించే(Admired) కంపెనీల జాబితాలో చేర్చింది. అలాగే CareerBliss టీసీఎస్ ను 2023లో తన 50 హ్యాపీయెస్ట్ కంపెనీల జాబితాలో చేర్చింది.

స్నేహపూర్వక కార్యాలయం..
TCS ఎంప్లాయ్ ఫ్లెండ్లీ కార్యాలయాన్ని సృష్టించడంపై దృష్టి పెట్టిందని టీసీఎస్ నార్త్ అమెరికా ఛైర్మన్ సురేష్ ముత్తుస్వామి తెలిపారు. ఇది ఉద్యోగుల్లో ఇన్నోవేషన్ ను పెంచటంతో పాటు వారు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదిగేందుకు వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా టీసీఎస్ అత్యుత్తమ కంపెనీల్లో ఒకటిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు అందుకోసం పెట్టుబడులు పెడుతున్నట్లు ముత్తుస్వామి వెల్లడించారు.

దిగ్గజాలతో వ్యాపారం..
దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో సగం మందిని తన క్లయింట్లుగా కలిగి ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నుంచి రిటైల్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, ట్రావెల్ వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ఇందుకోసం కంపెనీ వైవిధ్యమైన వర్క్‌ఫోర్స్‌ను రూపొందించింది. టీసీఎస్ ను ఫోర్బ్స్ 2022లో న్యూయార్క్ రాష్ట్రంలోని ఉత్తమ ఉద్యోగుల్లో ఒకటిగా గుర్తించింది. దాదాపు 50 ఏళ్లుగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కంపెనీ ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్, బిజినెస్ సొల్యూషన్స్ వంటి సేవలను అందిస్తోంది.


Click it and Unblock the Notifications