TCS News: దేశంలోని ఐటీ దిగ్గజం టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్న లక్షల మంది టెక్కీలకు వరుస షాకులు ఇస్తోంది. మిగిలిన కంపెనీలు టాటా కన్సల్టెన్సీ బాటలోనే క్రమంగా తమ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో టెక్ దిగ్గజం టీసీఎస్ హైబ్రిడ్ మోడల్ నిలిపివేస్తున్నట్లు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో లక్షల మంది ఉద్యోగులు వారంలో 5 రోజుల పాటు తప్పనిసరిగా కార్యాలయాల నుంచే పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ వార్త చాలా మంది టెక్ ఉద్యోగులకు అస్సలు మింగుడు పడలేదు. అయితే ఇతర దిగ్గజ ఐటీ సేవల కంపెనీలు సైతం ఈ క్రమంలో తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ తప్పనిసరి చేస్తున్నాయి.

కంపెనీ ఉద్యోగులకు తప్పకుండా ఆఫీసులకు రావాల్సిందేనని మెయిల్స్ పంపటంతో దాదాపు 80 శాతం ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వస్తున్నట్లు వెల్లడైంది. ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి వెళ్లేటప్పుడు డ్రస్ కోడ్‌ను గుర్తుంచుకోవాలని సిబ్బందికి చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ కక్కడ్ పంపిన ఈ-మెయిల్ సూచించింది. సరైన డ్రస్ కోడ్ పాటించటం ప్రాముఖ్యతను అందులో గుర్తు చేయటం జరిగింది. ఇది కంపెనీ గ్లోబల్ స్టేక్ హోల్డర్లకు సరైన ప్రభావాన్ని ఇస్తుందన్నారు.
గడచిన రెండేళ్లుగా చాలా మంది కొత్త ఉద్యోగులు టీసీఎస్ కంపెనీలో చేరారు. వీరిలో చాలా మంది ఇప్పటి వరకు రాకపోవటంతో సరైన వస్త్రధారణపై స్పష్టమైన మార్గదర్శకాలను కంపెనీ ఉద్యోగులకు ఇచ్చింది. పురుషులకు ప్యాంటుతో టక్డ్-ఇన్ ఫుల్-స్లీవ్ షర్టులు ధరించాలని కంపెనీ పేర్కొంది. అలాగే మహిళలకు బిజినెస్ దుస్తులు ధరించాలని పేర్కొంది. ఈ డ్రస్ కోడ్ సోమవారం నుంచి గురువారం వరకు వర్తిస్తుందని ఉద్యోగులకు పంపిన మెయిల్ స్పష్టం చేసింది. అలాగే కంపెనీ మీటింగ్స్, క్లయింట్ సందర్శనల వంటి సందర్భాల్లో కూడా బిజినెస్ ఫార్మల్స్ తప్పనిసరి చేసింది.
హాఫ్ స్లీవ్ షర్టులు, టర్టిల్‌నెక్, ఖాకీలు, చినోలు, కుర్తీ, సల్వార్(మహిళలు) మొదలైనవాటిని కలిగి ఉన్న స్మార్ట్ క్యాజువల్స్‌ను కంపెనీ శుక్రవారాల్లో మాత్రమే అనుమతిస్తుందని వెల్లడించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications