భారతదేశపు అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులలో కొంతమందికి రెండేళ్ల వరకు విరమణ ప్యాకేజీలను అందిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. మనీకంట్రోల్ తెలిపిన వివరాల ప్రకారం, కంపెనీ తన ఉద్యోగు సంఖ్యను పునర్వ్యవస్థీకరించే ప్రయత్నం చేస్తోంది. AI ఒత్తిడి, మారుతున్న క్లయింట్ల డిమాండ్‌ల కారణంగా అవసరం తగ్గిన కొంతమంది ఉద్యోగులను తొలగిస్తోంది.
రెండు నెలల క్రితం టీసీఎస్ తన మొత్తం ఉద్యోగ శక్తిలో రెండు శాతం, అంటే దాదాపు 12 వేల మందికి పైగా సిబ్బందిని తగ్గించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ ప్రభావం ఇప్పుడు పూణే వంటి కేంద్రాల్లో మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఐటీ ఉద్యోగుల సంఘం NITES ఆరోపణల ప్రకారం.. పూణేలో సుమారు 2,500 మంది ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయమని కంపెనీ ఒత్తిడి తెచ్చిందని, ఈ విషయాన్ని వారు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖలో వివరించారు.

అయితే, TCS మాత్రం ఈ ఆరోపణలకు భిన్నంగా స్పందించింది. తమ ప్రకటనలో ఉద్యోగి ప్రస్తుత నైపుణ్యాలను కంపెనీ అవసరాలకు సరిపోల్చడం కోసం ఇటీవల తీసుకున్న చర్యల వల్ల పరిమిత సంఖ్యలో మాత్రమే ఉద్యోగులు ప్రభావితమయ్యారని స్పష్టం చేసింది. అయినప్పటికీ, కంపెనీ తన సిబ్బందిలో నైపుణ్యాలు అనవసరమవుతున్నవారు లేదా కొత్త డిమాండ్లకు అనుగుణంగా తమను తాము అప్‌స్కిల్ చేసుకోని వారు ప్రధానంగా ఈ లేఆఫ్స్‌కి గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.
ఈ కార్యక్రమం కింద ఉద్యోగులకు మూడు నెలల నోటీసు వేతనం అందించబడుతుంది. ఆ తర్వాత వారి సేవాకాలాన్ని బట్టి కనీసం ఆరు నెలల నుండి గరిష్టంగా రెండు సంవత్సరాల జీతం వరకు విరమణ ప్యాకేజీ ఇవ్వబడుతుంది. కనీస ప్యాకేజీ ఆరు నెలల వేతనం కాగా, పదేళ్లకు పైగా అనుభవం కలిగిన ఉద్యోగులు సుమారు ఒకటిన్నర సంవత్సరాల జీతం ప్యాకేజీగా పొందే అవకాశం ఉంది. అత్యధికంగా రెండేళ్ల వరకు సివరెన్స్ అందించే అవకాశముందని నివేదిక పేర్కొంటోంది.
ఇంతటితో ఆగిపోకుండా..ప్రాజెక్ట్ లేని లేదా ఎనిమిది నెలలకు పైగా బెంచ్‌లో ఉన్న ఉద్యోగులు కూడా ప్రభావితమవుతున్నారు. వీరికి అందే ప్యాకేజీ మాత్రం పరిమిత స్థాయిలోనే ఉంది. వారికి మూడు నెలల వేతనానికి సమానమైన నోటీసు చెల్లింపే ప్రధాన పరిహారంగా ఇవ్వబడుతోంది. ఇది టీసీఎస్ తన బెంచ్ పాలసీని కఠినతరం చేసిందనే సంకేతాలను ఇస్తోంది. కంపెనీ, తన విలువలకు అనుగుణంగా ఉద్యోగులకు సరైన మద్దతు అందించడానికి కొన్ని చర్యలు చేపట్టినట్లు కూడా స్పష్టం చేసింది.
అవుట్‌ప్లేస్‌మెంట్ సేవల ద్వారా ఉద్యోగులను కొత్త అవకాశాలకు సాయపడటం, జూనియర్ అసోసియేట్‌ల రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఫీజులను మూడు నెలల పాటు భరించడం, బీమాతో పాటు ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను కొనసాగించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అదనంగా ముందస్తు పదవీ విరమణ (early retirement) ఎంపికను కూడా ఇచ్చే అవకాశం ఉంది, దీనితో ఉద్యోగులు ఆరు నెలల నుండి రెండేళ్ల వరకు జీతం అదనంగా పొందగలరు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ లేఆఫ్స్ వెనుక రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటిది కారణం ఏంటంటే AI, ఆటోమేషన్ వలన కొన్ని ఉద్యోగాల అవసరం తగ్గిపోవడం. రెండవ కారణం ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లు టెక్నాలజీ బడ్జెట్‌లను తగ్గించడం వల్ల పెద్ద ఎత్తున ఖర్చు నియంత్రణ చర్యలు తప్పనిసరి కావడం. ఏదేమైనా ఈ లేఆఫ్స్‌కి సంబంధించిన నిర్ణయాలు ఉద్యోగులలో భయం కలిగిస్తున్నాయి.
More From GoodReturns

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Layoffs: లేఆఫ్స్ నుండి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం ఇదే.. గోల్డ్‌మన్ సాక్స్ కీలక సూచన!

Layoffs: ఒరాకిల్ ఎందుకు ఇన్ని వేల మందిని తీసేస్తోంది? లోపల జరుగుతోంది ఇదే!

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

భారత ఐటీ రంగంలో కల్లోలం.. రెండు వైపుల నుంచి తరుముకొస్తున్న రిస్క్.. నిర్మల్ బాంగ్ సంచలన నివేదిక..

Layoffs: జీతం కోసం కాదు.. కేవలం ఆ ఒక్క కారణంతో 10 ఏళ్లు ఒకే కంపెనీలో! ఈ టెక్కీ కథ విన్నారా?

14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్.. టెక్ రంగాన్ని కుదిపేస్తున్న లేఆప్స్..

ఐటీ స్టాక్స్ Q4 ఫలితాలు..TCS, ఇన్ఫోసిస్ నుండి HCL టెక్ వరకు.. షేర్లు కొనుగోలుపై బిగ్ అలర్ట్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!



Click it and Unblock the Notifications