టీసీఎస్ ఉద్యోగాలు: మేనేజర్లకు కొత్త ఆదేశం.. భయం మొదలైంది!
భారత్‌లో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ (TCS). టాటా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీలో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతేడాది తమ ఉద్యోగుల్లో 2 శాతం మందిని తొలగిస్తున్నట్లు టీసీఎస్ ప్రకటించి, మొత్తం ఐటీ రంగానికి పెద్ద షాక్ ఇచ్చింది.
భారత్‌లో ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలా భావించే టీసీఎస్ కూడా ఉద్యోగులను తీసేస్తుందా అని అందరూ ఆశ్చర్యపోయారు. 12 వేల మందిని తొలగిస్తామని కంపెనీ చెప్పగా, వాస్తవానికి 20 వేల మందికి పైగా సంస్థను విడిచి వెళ్లారు. ఈ నేపథ్యంలో, టీసీఎస్ మళ్లీ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

ఎందుకంటే, టీసీఎస్ తమ మేనేజర్లకు ఓ కొత్త ఆదేశం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల్లో ఐదు శాతం మందిని 'బ్యాండ్ డి' అంటే తక్కువ పనితీరు కనబరిచే కేటగిరీకి మార్చాలని చెప్పినట్లు 'మింట్' నివేదిక పేర్కొంది. ఇటీవలే టీసీఎస్ తమ ఉద్యోగులకు 5% నుంచి 13% వరకు జీతాలు పెంచడం గమనార్హం.
ఈ పరిస్థితుల్లో, టీసీఎస్ హెచ్‌ఆర్ విభాగం నుంచి మేనేజర్లందరికీ ఓ ఈ-మెయిల్ వెళ్లిందట. "దయచేసి ఉద్యోగుల పనితీరును చాలా సీరియస్‌గా, జాగ్రత్తగా సమీక్షించండి. తక్కువ పనితీరు కనబరుస్తున్నారని మీరు భావించే వారి వివరాలను పంపండి" అని అందులో పేర్కొన్నట్లు సమాచారం. మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం మందిని ఈ లో-పెర్ఫార్మెన్స్ కేటగిరీలోకి తీసుకురావాలని అందులో స్పష్టంగా చెప్పారట.
ఇదే ఇప్పుడు ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమవుతోంది. ఎందుకంటే, గతేడాది కంపెనీ తొలగించిన 2 శాతం మందిని కూడా ఇలాగే 'అండర్ పెర్ఫార్మర్స్' (తక్కువ పనితీరు కనబరిచేవారు) కేటగిరీలో చేర్చారు. ప్రస్తుతం టీసీఎస్‌లో 5,84,519 మంది పనిచేస్తుండగా, వీరిలో ఇప్పటికే 17,500 మంది, అంటే 3 శాతం ఉద్యోగులు 'అండర్ పెర్ఫార్మర్' కేటగిరీలో ఉన్నారు. ఇప్పుడు వీరందరి ఉద్యోగాలు ఊడిపోతాయేమోనన్న భయం సర్వత్రా నెలకొంది.
ప్రస్తుతం భారత ఐటీ కంపెనీలు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అమెరికా ఆర్థిక మందగమనం, స్థూల ఆర్థిక పరిస్థితులు, ఏఐ (AI) టెక్నాలజీ పెరుగుదల వంటి వాటి మధ్య కంపెనీని నిలబెట్టుకోవాలి, లాభాలను పెంచుకోవాలి, ఏఐ రంగంలోనూ ఎదగాలని సంస్థలు పోరాడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగాల కోతలు కూడా చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాది, భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థలలో కేవలం టీసీఎస్ మాత్రమే ఉద్యోగాల తొలగింపు చర్యలు చేపట్టింది.


Click it and Unblock the Notifications