Layoffs News: ప్రస్తుతం ఎక్కడ చూసినా లేఆఫ్స్ ట్రెండ్ నడుస్తోంది. పలు దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూనే ఉన్నాయి. కానీ భారతీయ టెక్ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మాత్రం ఇప్పటివరకు వాటికి కొంత దూరంగా ఉంది. కాగా తాజా సమాచారం మేరకు TCS కూడా ఈ జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. టెక్ దిగ్గజం నిర్ణయం కాస్తా కంపెనీ మెడకు చుట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
TCS 22 మంది US ఉద్యోగులను తొలగించినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఆ కార్మికులు కంపెనీపై US ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తమ ఉద్యోగాలను H1-B వీసాలతో ఉన్న భారతీయులకు కల్పించినట్లు బాధితులు ఆరోపించారని వెల్లడించింది.

తమపై జాతి మరియు వయస్సు ఆధారంగా TCS వివక్ష చూపుతోందంటూ కొలువు కోల్పోయిన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా షార్ట్ నోటీసుతో తమను తొలగించారని పేర్కొన్నారు. కాగా సంస్థ క్లయింట్లలో డజన్ల కొద్దీ అమెరికన్ సంస్థలు ఉండటంతో ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందోనని టెక్ వర్గాలు ఆందోళ చెందుతున్నాయి.
తొలగించబడిన TCS ఉద్యోగుల్లో కాకేసియన్లు, ఆసియన్-అమెరికన్లు, హిస్పానిక్ అమెరికన్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారందరూ 40 నుంచి 60ల మధ్య వయస్సు కలిగి, డజనుకు పైగా US రాష్ట్రాలలో నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది MBA లేదా ఇతర అధునాతన డిగ్రీలను కలిగి ఉన్నారు. కాగా భారతీయ కార్మికులకు TCS ప్రాధాన్యత ఇస్తున్నట్లు అమెరికన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆరోపణలను TCS ప్రతినిధి ఖండించారు.
More From GoodReturns

Layoffs: కోడింగ్ చేసే రోజులు పోయాయా? లేఆఫ్స్ భయాల మధ్య TCS సీఈఓ కీలక వ్యాఖ్యలు!

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Layoffs: లేఆఫ్స్ నుండి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం ఇదే.. గోల్డ్మన్ సాక్స్ కీలక సూచన!

Layoffs: ఒరాకిల్ ఎందుకు ఇన్ని వేల మందిని తీసేస్తోంది? లోపల జరుగుతోంది ఇదే!

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

Layoffs: జీతం కోసం కాదు.. కేవలం ఆ ఒక్క కారణంతో 10 ఏళ్లు ఒకే కంపెనీలో! ఈ టెక్కీ కథ విన్నారా?

14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్.. టెక్ రంగాన్ని కుదిపేస్తున్న లేఆప్స్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..



Click it and Unblock the Notifications