ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కంపెనీ అక్టోబర్ 1 నుంచి హైబ్రిడ్ పద్ధతి ముగించవచ్చని తెలుస్తోంది. హైబ్రిడ్ మోడ్ వారంలో కొద్ది రోజులు ఆఫీస్ కు మరి కొద్ది రోజులు వర్క్ ఫ్రమ్ చేసుకోవచ్చు. అయితే దీన్ని రద్దు చేయవచ్చని వార్తలు వస్తున్నారు. వారంలో ఐదు రోజులు కార్యాలయానికి హాజరు కావాలని కంపెనీ అంతర్గత ఇ-మెయిల్ ద్వారా తన ఉద్యోగులను కోరినట్లు సమాచారం. TCS వివిధ విభాగాల మేనేజర్లు తమ ఉద్యోగులను వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పని చేయమని ఇ-మెయిల్‌లో అడుగుతున్నారు.
TCS హైబ్రిడ్ పాలసీ మరియు ఫ్లెక్సిబిలిటీని కూడా అవలంభిస్తుంది, తద్వారా అవసరమైనప్పుడు కొన్ని మినహాయింపులు ఉండనున్నాయి. TCS ఉద్యోగులకు పంపిన మేయిల్ లో "వివిధ టౌన్‌హాల్స్‌లో CEO, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ (CHRO) తెలియజేసినట్లుగా, అసోసియేట్‌లందరికీ అక్టోబర్ 1, 2023 నుంచి అన్ని పని దినాలలో (సెలవులు లేనట్లయితే, ప్రతి వారం 5 రోజులు ఆఫీసులో ఉండటం తప్పనిసరి"అని పేర్కొన్నారు.సెప్టెంబరు 2022 నుండి ఉద్యోగులు రోస్టర్‌ను అనుసరించి వారానికి మూడు రోజులు కార్యాలయంలో ఉండొచ్చని టీసీఎస్ సూచించింది.

ఉద్యోగులు ఈ రోస్టర్‌ను పాటించకుంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కూడా. తాజాగా హైబ్రిడ్ కూడా రద్ద చేయడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. ఇమెయిల్ అన్ని బృందాలకు పంపలేదని తెలుస్తోంది. దీనిపై స్పందించడానికి TCS నిరాకరించింది. జూన్ 30, 2023తో ముగిసిన త్రైమాసికంలో TCS 615,318 మంది ఉద్యోగులను కలిగి ఉంది. మిగతా కంపెనీలు కూడా టీసీఎస్ బాటలో నడిచే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోం ఎంజాయ్ చేసిన వారు ఇక నుంచి ఆఫీసులకు రావాల్సి రావొచ్చు.


Click it and Unblock the Notifications