టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. తన ఆఫ్-క్యాంపస్ డిజిటల్ హైరింగ్ ప్రోగ్రాం కోసం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25. అభ్యర్థులు ఆన్ లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఎంపికైన అభ్యర్థులు తమ అర్హతలను బట్టి వేతనం పొందుతారు. అండర్ గ్రాడ్యుయేట్స్ సంవత్సరానికి రూ.7 లక్షలు పొందుతారు. అయితే వారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఏడాదికి రూ.7.3 లక్షల వేతనం పొందుతారు.
గుర్తింపు పొందిన కాలేజీ, యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆర్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్) లేదా (ఎంటెక్), బ్యాచిలర్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ (బీఈ) లేదా (ఎంఈ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) ఉండాలి. 2019, 2020, 2021 గ్రాడ్యుయేట్స్ దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులకు ఐటీ ఇండస్ట్రీలో ఆరు నెలల నుండి 12 నెలల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
పదో తరగతి, పన్నెండో తరగతి, డిప్లోమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో అభ్యర్థులు కనీసం 70 శాతం సాధించాలి. బ్యాక్ లాగ్స్ ఉండరాదు. కోర్సును నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసి ఉండాలి.
చదువులో ఏదైనా గ్యాప్ ఉంటేకనుక, దానిని తప్పనిసరిగా వెల్లడించాలి. అత్యధిక విద్యార్హత వరకు మొత్తం అకడమిక్ గ్యాప్ 24 నెలలు మించరాదు.ఫుల్ టైమ్ కోర్సును మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. పార్ట్ టైమ్ లేదా కరెస్పాండెన్స్ కోర్సును పరిగణలోకి తీసుకోరు.
కంపెనీ నిర్వహించే రెండు రౌండ్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్ష రిమోట్‌గా నిర్వహిస్తారు. అడ్వాన్స్డ్ క్యాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వర్బల్ ఎబిలిటీ, అడ్వాన్స్డ్ కోడింగ్ ఆధారంగా పలు ప్రశ్నలు ఉంటాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications