AI: ChatGPT మార్కెట్లోకి వచ్చిన తర్వాత ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు దృష్టి సారించాయి. భారతీయ IT దిగ్గజాలు TCS, ఇన్ఫోసిస్ సైతం AI వినియోగాన్ని పెంచడానికి సిద్ధమవుతున్నాయి. FY23 Q4 ఫలితాల కాల్ అనంతరం కృత్రిమ మేధ సామర్థ్యాన్ని మోనటైజ్ చేసే ప్రణాళికలను బయటకు వెల్లడించాయి. OpenAIకు చెందిన చాట్ బాట్ ChatGPTకి ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
క్లయింట్ల నుంచి మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, మా ఉత్పాదకతను మెరుగుపరచడానికి AIతో కలిసి పనిచేస్తున్నట్లు ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్ గత గురువారం వ్యాఖ్యానించారు. TCS COO గణపతి సుబ్రహ్మణ్యం సైతం ఇదే తరహా ఆలోచనలను పంచుకున్నారు. సాంకేతికతగా ఉత్పాదక AI చాలా ఆసక్తికరంగా ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. కొంతకాలంగా దానిపై పని చేస్తున్నామని, అంతర్గతంగా కొన్ని పైలట్ ప్రాజెక్టులు సైతం చేసినట్లు తెలిపారు.

AI సామర్థ్యాలను ఉపయోగిస్తున్న అనేక ప్రాజెక్టులపై ఇన్ఫోసిస్ ఇప్పటికే పని చేస్తోందని పరేఖ్ చెప్పారు. వ్యాపార సమస్యల పరిష్కారానికి ఉత్పాదక AI ప్లాట్ ఫారమ్స్ వినియోగించడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించే క్లయింట్లతోనూ క్రియాశీలక ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు. అంతర్గత సాఫ్ట్ వేర్ లైబ్రరీలపై తమ AI మోడళ్లకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. అయితే ఇతర పెట్టుబడిదారులతో కలిసి OpenAIకి ఇన్ఫోసిస్ 2015లో బిలియన్ డాలర్లు అందించడం గమనార్హం.
అయితే భారతీయ IT కంపెనీలు సృష్టించిన AI సాధనాలను ChatGPT, NotionAI, Midjourney మొదలైన వాటితో పోల్చవచ్చా అని చూస్తే మాత్రం చాలా మట్టుకు నిపుణులు, పలు మేనేజ్ మెంట్స్ కాదనే అంటున్నారు. AI విప్లవంలో ఇండియన్ IT సంస్థలు బాగా వెనకబడి ఉన్నట్లు స్టార్టర్స్, నిపుణులు కూడా భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ రూపొందించడం కంటే ఇప్పటికే మార్కెట్లో ఉన్న వాటిని ఉత్తమంగా వినియోగించుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications