TCS Shares: గతవారం ఫెడ్ నిర్ణయం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభావితమైన భారత మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో టాటాలకు చెందిన స్టాక్ సైతం నష్టాల సుడిగుండంలోకి తన ఇన్వెస్టర్లను నెట్టేసింది.
వివరాల్లోకి వెళితే.. టాప్-10 అత్యంత విలువైన సెన్సెక్స్ కంపెనీల్లో ఐదు మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం ఏకంగా రూ.1,97,958.56 కోట్లు క్షీణించింది. అస్థిర వ్యాపారంలో అత్యధికంగా నష్టపోయినవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్.
టీసీఎస్ మార్కెట్ విలువ వారంలో రూ.1,10,134.58 కోట్లు తగ్గి రూ.14,15,793.83 కోట్లకు చేరుకుంది. దీంతో గడచిన వారం రోజుల్లో టీసీఎస్ షేర్లలో పెట్టుబడిపెట్టిన వినియోగదారులు అత్యధికంగా నష్టపోయారు.

ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.52,291.05 కోట్లు తగ్గి రూ.6,26,280.51 కోట్లకు చేరుకుంది. టెక్నాలజీ దిగ్గజం యాక్సెంచర్ 2023-24 సంవత్సరానికి ఆదాయ అంచనాలను తగ్గిస్తున్నట్లు చేసిన ప్రకటన శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో పెద్ద ప్రకంపనను సృష్టించింది. దీంతో టెక్ రంగంలోని ప్రముఖ కంపెనీల ఇన్వెస్టర్లు వాటాల అమ్మకానికి ఎగబడ్డారు. ఈ క్రమంలో హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ విలువ రూ.16,834.82 కోట్లు తగ్గి రూ.5,30,126.53 కోట్లకు, ఎల్‌ఐసీ మార్కెట్ విలువ రూ.11,701.24 కోట్లు క్షీణించి రూ.5,73,266.17 కోట్లకు చేరుకుంది. ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,996.87 కోట్లు తగ్గి రూ.10,96,154.91 కోట్లకు చేరుకుంది.
ఈ ట్రెండ్‌కు భిన్నంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాల్యుయేషన్ రూ.49,152.89 కోట్లు పెరిగి రూ.19,68,748.04 కోట్లకు చేరుకుంది. అలాగే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర విలువ రూ.12,851.44 కోట్లు పెరిగి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,66,133.03 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.11,108.51 కోట్లు పెరిగి రూ.5,34,768.59 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్‌టెల్ విలువ రూ.9,430.48 కోట్లు పెరిగి రూ.6,98,855.66 కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,191.79 కోట్లు పెరిగి రూ.7,65,409.98 కోట్లకు చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications