Tech Companies H1B visas: ప్రస్తుతం అమెరికాలో హెచ్1బి వీసాల జారీ విషయంలో పెద్ద చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు అందించే ఈ రకం వీసాల జారీకి అనుకూలంగా ఎలాన్ మస్క్ ఇటీవల తన మద్దతును ప్రకటిస్తూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చర్చపై ఇటీవల ఇండియా సైతం తన మౌనాన్ని వీడింది.
వాస్తవానికి సెప్టెంబర్ 30, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో యూఎస్ మెుత్తం విడుదల చేసిన 2,65,777 హెచ్1బి వీసాల్లో దాదాపు 78 శాతం భారతీయులు అందుకున్నట్లు ఇమ్మగ్రేషన్ గణాంకాలు వెల్లడించాయి. నైపుణ్యం కలిగిన నిపుణుల ఇండియా-యూఎస్ బంధంలో ముఖ్యమైన భాగమని, ఇరు దేశాల సంబంధాలు, ప్రయోజనాలను మెరుగుపరుస్తుందని గత శుక్రవారం భారత ప్రభుత్వం ప్రకటించటం గమనార్హం. యూఎస్ పౌరసత్వం అండ్ ఇమ్మిగ్రేషన్ సేవల డేటా ప్రకారం ఏప్రిల్-సెప్టెంబర్ 2024 కాలంలో వివిధ యజమానులకు జారీ చేయబడిన మొత్తం 130,000 H1B వీసాలను జారీ చేయగా.. దాదాపు 24,766 వీసాలు భారతీయ సంతతికి చెందిన కంపెనీలకు జారీ చేయబడ్డాయి.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారతీయ ఆధారిత టెక్ కంపెనీలు మెుత్తం జారీ చేయబడిన హెచ్1బి వీసాల్లో ఐదోవంతు దక్కించుకున్నట్లు వెల్లడైంది. ఇందులోనూ ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీలు అత్యధిక వీసాలను పొంది అగ్రగామిగా నిలిచాయని డేటా ప్రకారం వెల్లడైంది. ఇన్ఫోసిస్ 8140, టీసీఎస్ 5274, హెచ్సీఎల్ అమెరికా 2953 వీసాలను పొందాయి. అయితే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అమెజాన్ 9265, కాగ్నిజెంట్ 6321 వీసాలను పొందాయని డేటా వెల్లడైంది. ఇదే క్రమంలో విప్రో 1634, టెక్ మహీంద్రా 1199 విసాలను పొందాయి. ప్రధానంగా హెచ్1బి వీసాల ప్రయోజనాన్ని భారదేశంలోని ఐటీ పరిశ్రమకు చెందిన కంపెనీలు ఎక్కువగా వినియోగించుకుంటున్నాయని వెల్లడైంది.
విస్తృత ఇమ్మిగ్రేషన్ విధాన సంస్కరణలతో నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం US వ్యాపారాల అవసరాలను సమతుల్యం చేయడంపై H1B వీసా భవిష్యత్తు ఆధారపడి ఉండనుంది. వాస్తవానికి ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కూడా ఒకప్పటి హెచ్1బి వీసా హోల్డర్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆయనకు సంబంధించిన ఈవీ కంపెనీ టెస్లా నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతను తీర్చుకునేందుకు ఈ ప్రోగ్రామ్ కింద ఉద్యోగులను నియమించుకుంటున్న సంగతి తెలిసిందే. టెక్ పరిశ్రమ విదేశీ కార్మికులపై ఆధారపడటానికి బహిరంగంగా ఎలాన్ మస్క్ మద్దతు ఇచ్చారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఇరాన్ కథను వచ్చే వారంలో ముగిస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన.. బెదిరింపులపై ఇరాన్ ఏమందంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications