ముంబై: టాప్ 10లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజషన్ గతవారం రూ.1.4 లక్షల కోట్లు క్షీణించింది. ఇందులో ప్రధానంగా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల మార్కెట్ క్యాప్ తగ్గింది. ఏడు కంపెనీల మార్కెట్ క్యాప్ అక్షరాలా రూ.1,41,628.37 కోట్లు తగ్గింది. అంతకుముందు వారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), ఇన్ఫోసిస్ కంపెనీల మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. ఫలితాల అనంతరం పలు ఐటీ సంస్థల షేర్ క్షీణించింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ క్షీణించింది
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.47,680.78 కోట్లు క్షీణించి రూ.11,81,218.07 కోట్లకు పడిపోయింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.37,579.03 కోట్లు తగ్గి రూ.5,76,275.68 కోట్లుగా నమోదయింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.30,841.38 కోట్లు పడిపోయి రూ.12,26,048.07 కోట్లుగా నమోదయింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ క్యాప్ రూ.11,735.86 కోట్లు క్షీణించి రూ.3,03,347.55 కోట్లుగా ఉంది.
కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ రూ.6,620.48 కోట్లు తగ్గి రూ.3,49,903 కోట్లకు పడిపోయింది.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.4,534.66 కోట్లు క్షీణించి రూ.5,77,206.58 కోట్లకు తగ్గింది.
భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ.2,636.18 కోట్లు తగ్గి రూ.2,96,871.53 కోట్లుగా నమోదయింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్
మూడు కంపెనీల మార్కెట్ క్యాప్ మాత్రం పెరిగింది. HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,697.4 కోట్లు ఎగిసి రూ.4,64,254.63 కోట్లుగా నమోదయింది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.3,748.69 కోట్లు పెరిగి రూ.7,87,472.56 కోట్లుగా నమోదయింది.
ICICI బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.123.98 కోట్లు పెరిగి రూ.3,91,902.83 కోట్లకు చేరుకుంది.

టాప్ 10 కంపెనీలు ఇవే..
గత వారం మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 10 కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా టీసీఎస్, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications