TCS Penalty: భారత ఐటీ సేవల రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న టీసీఎస్ పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొంటోంది. తాజాగా అమెరికా కోర్టు కంపెనీపై వందల కోట్ల పెనాల్టీ విధించటం పెద్ద చర్చకు దారితీసింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేసిన కేసులో అమెరికా కోర్టు ముందు దోషిగా నిలిచింది. ఈ వ్యవహారంలో అక్కడి కోర్టు టెక్ దిగ్గజంపై మెుత్తం 194.2 మిలియన్ డాలర్ల పెనాల్టీని విధించింది. ఇది భారత కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపు రూ.1,600 కోట్లకు సమానంగా ఉంది.

టీసీఎస్ తమ వ్యాపార రహస్యాలను బయటపెట్టిందని ఆరోపిస్తూ కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్(CSC) ప్రస్తుతం DXC టెక్నాలజీస్ కేసు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా డిస్ట్రిక్ కోర్టులో టీసీఎస్‌కు ప్రతికూలంగా తీర్పు వెలువరించటం గమనార్హం. ఈ విషయాన్ని కంపెనీ తన ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో టీసీఎస్ పేర్కొంది. ఈమేరకు జూన్ 14న కోర్టు నుంచి ఉత్తర్వులు అందుకున్నట్లు తెలిపింది. ఈ తీర్పు తమ ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపబోదని పేర్కొంది.
అమెరికా కోర్టు అందించిన తీర్పును ఎదుర్కోవడానికి టీసీఎస్ బలమైన వాదనలను కలిగి ఉందని, రివ్యూ పిటిషన్ లేదా సముచిత న్యాయస్థానానికి అప్పీల్ చేయడం ద్వారా తన స్థానాన్ని సమర్థించుకోవాలని టెక్ దిగ్గజం యోచిస్తోంది. కంపెనీ తన ప్రయోజనాలను పరిరక్షించడానికి మరియు ఈ తీర్పు ద్వారా అందించబడిన చట్టపరమైన సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటోంది. కంపెనీ ఈ తీర్పు వివరాలను ఈనెల 14న అందుకోగా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ షేర్ ధర ఒక్కోటి రూ.45.55 లేదా BSEలో 1.17% తగ్గి రూ.3,831.95 వద్ద ముగిశాయి.


Click it and Unblock the Notifications