TCS: టీసీఎస్ ఉద్యోగులకు షాక్.. వారికి ఈసారి ఆ ఛాన్స్ లేనట్లే..!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై దృష్టి సారిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. ఏఐ నిపుణులను నియమించుకుంటామని ప్రకటించింది. ఇందుకోసం భారీ ఖర్చు చేయనుంది. అయితే ప్రస్తుతం సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్లు ఈసారి లేనట్లేనని తెలుస్తోంది. ఆ కంపెనీ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒక ఉద్యోగి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పదోన్నతులు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయని యాజమాన్యం తెలిపింది. కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
టీసీఎస్ తన ప్రపంచవ్యాప్త ఉద్యోగులలో దాదాపు 80 శాతం ఉద్యోగులకు జీతం పెంచింది. కానీ ప్రమోషన్ల గురించి క్లారిటీ ఇవ్వలేదు. టీసీఎస్ లో 2025లో ప్రమోషన్లు ఇచ్చారు. అప్పుడు మెరిట్ ఆధారంగా 1,10,000 మంది ఉద్యోగులకు పదోన్నతి కల్పించినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది మే నెలలో కంపెనీ వార్షిక జీతాల పెంపులను ప్రకటించింది. అయినప్పటికీ ప్రమోషన్లపై స్పష్టత ఇవ్వలేదు. ఏప్రిల్ 2026లో ప్రమోషన్లు జరిగాయని కొంతమంది ఉద్యోగులు చెప్పినప్పటికీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తాజాగా టీసీఎస్ అంతర్గత లెర్నింగ్, కెరీర్ ప్రోగ్రెషన్ ప్రోగ్రామ్ అయిన వింగ్స్ గురించి కూడా యాజమాన్యం ఉద్యోగులకు తెలియజేసింది. కంపెనీ ఏఐ-ఫస్ట్ వ్యూహానికి అనుగుణంగా దానిని పునఃరూపకల్పన చేసినట్లు ప్రకటించింది. పునరుద్ధరించిన ఈ ప్రోగ్రామ్‌లో దాని పాఠ్యప్రణాళిక, అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌లో మార్పులు ఉంటాయని, ఏఐ నైపుణ్యాలపై ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, బాహ్య లెర్నింగ్ భాగస్వాములతో కలిసి పనిచేయడానికి ప్రాధాన్యత ఇస్తారని ఉద్యోగులు చెప్పారు. కాగా టీసీఎస్ కంపెనీ ఏఐ వల్ల తీవ్ర ఒత్తడిని ఎదుర్కొంటుంది.
అయితే ఈ మధ్య కాలంలో కంపెనీ త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆ తర్వాత కంపెనీ కూడా ఏఐపై దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించడంతో టీసీఎస్ స్టాక్ కాస్త పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాగా ఈ ఐటీ సేవల దిగ్గజం, బీఎఫ్ఎస్ఐ, సైబర్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్స్ అండ్ మీడియా, ఎనర్జీ రిసోర్సెస్ అండ్ యూటిలిటీ, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, యూఎస్ వెస్ట్, యూఎస్ ఈస్ట్ బిజినెస్ గ్రూప్ వర్టికల్స్‌లో చాలా మార్పులు చేసింది. అటానమస్ బిజినెస్ ఆపరేషన్స్, సర్వీస్‌నౌ ఆపరేషన్స్ వంటి కొత్త వ్యాపార విభాగాలను కూడా ఏర్పాటు చేసింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications