కోవిడ్ సమయంలో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఇప్పటికీ కొన్ని కంపెనీల్లో అమలు అవుతుంది. ఇప్పటికీ చాలామంది ఐటీ ఉద్యోగులు వారానికి రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఆఫీసుకి వెళ్తున్నారు. అయితే ఉద్యోగులను తిరిగి ఆఫీసుకి రప్పించడానికి కంపెనీలు ఎంత ప్రయత్నిస్తున్నా అది సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో భారతీయ ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సంస్కృతికి పూర్తిగా స్వస్తి పలకాలని డిసైడ్ అయింది. బెంగళూరు (Bengaluru) సహా దేశవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలకు ఉద్యోగులు కచ్చితంగా రావాల్సిందేనని, లేనిపక్షంలో వారి యాన్యువల్ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వంటివి నిలిపివేస్తామని సంచలన నిర్ణయం తీసుకుంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఏమిటీ వివాదం?
TCS నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీస్ నుంచి పని చేయాలి. అయితే గత కొన్ని త్రైమాసికాలుగా (ముఖ్యంగా Q2 FY26 వరకు) ఈ నిబంధనను పాటించని ఉద్యోగులకు కంపెనీ షాక్ ఇచ్చింది. "మీ వార్షిక అప్రైజల్ ప్రక్రియ పూర్తయినప్పటికీ.. మీరు ఆఫీస్ అటెండెన్స్ నిబంధనలు పాటించనందున దానిని ముందుకు తీసుకెళ్లడం లేదు" అంటూ సంబంధిత ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపింది.
అప్రైజల్స్ నిలిపివేతతో వచ్చే నష్టాలేంటి?
కంపెనీ పంపిన ఈమెయిల్ ప్రకారం.. WFO నిబంధనలు పాటించని వారు..
- • FY26 బాండింగ్ సైకిల్ నుండి మినహాయించబడతారు.
- • వారికి ఎలాంటి పెర్ఫార్మెన్స్ బ్యాండ్ విడుదల చేయబడదు.
- • ఫలితంగా జీతాల పెంపు (Increments), ప్రమోషన్లకు అవకాశం ఉండదు.
కఠినమైన అటెండెన్స్ పాలసీ
దేశంలోని ఇతర ఐటీ కంపెనీలు వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీస్‌కు వస్తే చాలని చెబుతుంటే.. TCS మాత్రం ఐదు రోజులు కచ్చితంగా రావాలని నిబంధన పెట్టింది. అంతేకాకుండా వేరియబుల్ పే (Variable Pay) ను కూడా అటెండెన్స్‌తో లింక్ చేసింది.
వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల కోసం ఒక త్రైమాసికంలో కేవలం 6 రోజులు మాత్రమే మినహాయింపు ఇస్తోంది. నెట్‌వర్క్ సమస్యలు లేదా ఇతర కారణాలను సాకుగా చూపడాన్ని కూడా కంపెనీ నిశితంగా గమనిస్తోంది. బల్క్ అప్‌లోడ్స్ ద్వారా మినహాయింపు కోరడాన్ని కూడా నిషేధించింది.
బెంగళూరు ఐటీ మార్కెట్‌పై ప్రభావం
బెంగళూరు (Bengaluru) లోని లక్షలాది మంది ఐటీ ఉద్యోగులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆఫీస్ రావడానికి ట్రాఫిక్ సమస్యలు, అద్దె ఇళ్ల కొరత వంటి కారణాలు చూపుతున్న ఉద్యోగులకు TCS తీసుకున్న ఈ కఠిన చర్య ఒక హెచ్చరికగా మారింది. ఇతర ఐటీ కంపెనీలు కూడా భవిష్యత్తులో ఇదే బాట పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి ఐటీ రంగంలో మళ్ళీ 'ఆఫీస్ కల్చర్' ను బలంగా తీసుకురావడానికి TCS చేస్తున్న ఈ ప్రయత్నం ఉద్యోగుల్లో మిశ్రమ స్పందనను కలిగిస్తోంది. కెరీర్‌లో ఎదగాలంటే ఇప్పుడు టాలెంట్‌తో పాటు 'ఆఫీస్ హాజరు' కూడా తప్పనిసరి అని స్పష్టమవుతోంది. మరి దీనిపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి!
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Bengaluru: గ్లోబల్ టెక్ రేసులో దూసుకుపోతున్న బెంగళూరు! పారిస్, టోక్యోలను వెనక్కి నెట్టి ఆరో స్థానంలో!

బెంగళూరు ట్రాఫిక్ క్లియర్ కావాలంటే.. 25 అండర్‌పాసులు, 35 ఫ్లైవోర్స్, 101 స్కైవాక్స్ కావాల్సిందే..

Bengaluru: బెంగళూరు మెట్రోకు ఏమైంది? విస్తరణ జరుగుతున్నా పెరగని ప్రయాణికుల సంఖ్య!

Bengaluru: బెంగళూరు మేక్రి సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 420 కోట్లతో భారీ ఫ్లైఓవర్!

Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..

బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..

Bengaluru: బెంగళూరులో ఫుడ్ ధరలకు రెక్కలు! దోశ, ఇడ్లీ రేట్లు ఎంత పెరిగాయో తెలుసా?

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: జాబ్ పోయినా నాకు టెన్షన్ లేదు! ఎందుకంటే... బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!



Click it and Unblock the Notifications