IT news: ఇండియాలో టాటా గ్రూపునకు ఉన్న పేరు ప్రఖ్యాతులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ TCS అయితే ప్రపంచ వ్యాప్తంగా అందిరికీ పరిచయమున్న భారతీయ దిగ్గజ IT సంస్థ. ఎన్నో గొప్ప అవార్డులు, రివార్డులు దీని సొంతం. అయితే 2013 నుంచి ఈ కంపెనీతో కలిసి పనిచేస్తున్న CEO రాజేష్ గోపీనాథన్ రాజీనామా.. యావత్ ఐటీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది.

సెప్టెంబరు 15 నుంచి సలహాదారునిగా..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అవుట్ గోయింగ్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రాజేష్ గోపీనాథన్ ను సలహాదారునిగా నియమించుకునే అవకాశాన్ని టాటా గ్రూపు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. CEO గా ఆయన రాజీనామా చేయడంతో.. ఆ స్థానంలో కె. కృతివాసన్ మార్చి 16 నుంచి కొనసాగుతారని గత గురువారం కంపెనీ బోర్డు ప్రకటించింది. కొత్త CEO కి బాధ్యతలు అప్పచెప్పేందుకు గాను సెప్టెంబర్ 15, 2023 వరకు గోపీనాథన్ సంస్థలో కొనసాగుతారని TCS వెల్లడించింది.

టాటా సన్స్ ఛైర్మన్ తో చర్చలు:
సెప్టెంబరు 15 తర్వాత గోపీనాథన్ ను సలహాదారునిగా నియమించడానికి టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. కంపెనీ నిర్వహిస్తున్న వివిధ టెక్నాలజీ డొమైన్‌లలో వైవిధ్యభరిత, విశ్వసనీయ అనుభవజ్ఞులు అవసరం ఉండటంతో ఇరువురి మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయని ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. అయితే ప్రస్తుతం ఆ దిశగా ప్రణాళికలేవీ తనకు లేవని గోపినాథన్ గత శుక్రవారం మీడియాకు స్పష్టం చేశారు.

ఆశ్చర్యంలో IT ఇండస్ట్రీ:
స్థిరమైన నాయకత్వం కలిగి ఉన్న TCS వంటి సంస్థ నుంచి CEO స్థాయి వ్యక్తి వైదొలగడం పట్ల ఇండస్ట్రీ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కంపెనీ వ్యూహాల్లో భారీ మార్పులేమీ లేని కారణంగా స్టాక్ మార్కెట్లు సైతం సాధారణంగానే స్పందించాయి. ఏప్రిల్ 2022లో సంస్థ ప్రారంభించిన పునర్వ్యవస్థీకరణ, వృద్ధి మందగించడం, అసంతృప్తి వంటివి ఆయన ఆకస్మిక రాజీనామాకు కొన్ని కారణాలని మరో మీడియా సంస్థ అభిప్రాయపడింది.

కంపెనీ నాయకుడిగా మంచి రికార్డు:
2013 నుంచి కంపెనీ CFOగా పనిచేసిన గోపీనాథన్.. ఫిబ్రవరి 2017లో CEO గా నియమితులయ్యారు. 2021-22 చివరి నాటికి TCS 25.7 బిలియన్ డాలర్ల గ్లోబల్ కంపెనీగా అవతరించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 6 లక్షల 13 వేల ఉద్యోగులతో అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయర్‌గాను ఈ సంస్థ నిలిచింది. ఆయన నాయకత్వంలో 2022-23లో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 167.86 బిలియన్ డాలర్లను దాటింది. ప్రస్తుతం భారతదేశంలో రెండవ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications