For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులకు టీసీఎస్ గుడ్‌న్యూస్, ఆరు నెలల్లో వేతనాల పెంపు

|

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తాజా నిర్ణయంతో 4.7 లక్షలమంది ఉద్యోగులకు ప్రయోజనం దక్కుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించిన మొదటి ఐటీ కంపెనీ టీసీఎస్. గత ఆరు నెలల కాలంలో ఈ కంపెనీ ఉద్యోగులకు ఇది రెండో వేతన పెంపు. గత ఏడాది అక్టోబర్ 6 శాతం నుండి 8 శాతం పెంచింది.

తాజా పెంపుతో కలిసి ఉద్యోగుల వేతనం 12 శాతం నుండి 14 శాతానికి పెరగనుంది. కంపెనీ ప్రపంచవ్యాప్త కార్యాలయాల్లోని సిబ్బందికి 2021 ఏప్రిల్ నుండి వేతనాలు పెంచుతున్నామని, ఈ కష్టకాలంలో కంపెనీని ముందుకు నడిపించేందుకు అవసరమైన వినూత్న దృక్పథాన్ని కనబరిచినందుకు గాను తమ సిబ్బందికి థ్యాంక్స్ అని, వారిపట్ల కంపెనీకి ఉన్న ధృఢమైన నిబద్ధతకు ఈ నిర్ణయమే నిదర్శనమని పేర్కొంది.

 TCS first IT company to announce salary increment for financial year 2021-22

కరోనా సమయంలోను క్రితంసారి సీటీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తమ ఉద్యోగుల వేతనాలను 2020 అక్టోబర్-2021 జనవరి మధ్యకాలంలో పెంచాయి.

English summary

ఉద్యోగులకు టీసీఎస్ గుడ్‌న్యూస్, ఆరు నెలల్లో వేతనాల పెంపు | TCS first IT company to announce salary increment for financial year 2021-22

India's largest software services firm Tata Consultancy Services (TCS) has today announced salary hikes for all its employees. The salary hikes would be effective from April 1, the company said.
Story first published: Saturday, March 20, 2021, 7:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X