TCS News: ఆ ఉద్యోగులపై గుర్రుగా ఉన్న TCS.. కీలక ఆదేశాలు.. ఫాలో కాకుంటే తీవ్ర పరిణామాలు
Work from office: దిగ్గజ టెక్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉద్యోగులపై కన్నెర్ర జేసింది. తమ ఆదేశాలు పాటించని వారికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. ఇకపై సహించబోమంటూ తీవ్రంగా హెచ్చరింది. కఠిన చర్యలకు వెనకాడబోమని తేల్చి చెప్పింది.
ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయాలకు హాజరు కావాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇప్పటికే అల్టిమేటం జారీ చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. వివిధ కారణాల రీత్యా ఇప్పటికీ ఇంటి నుంచి పనిచేస్తున్న సిబ్బంది కూడా మార్చిలోగా కార్యాలయాల్లో విధులను తిరిగి ప్రారంభించాలని ఆదేశించినట్లు పేర్కొంది. రిమోట్‌గా పనిచేస్తున్న వారికి ఇదే 'చివరి కాల్' అని TCS స్పష్టం చేసినట్లు వెల్లడించింది.

'సిబ్బంది 5 రోజుల పాటు కార్యాలయాలకు హాజరుకావడాన్ని గతేడాది అక్టోబర్‌లోనే తప్పనిసరి చేశాం. అయినప్పటికీ మేము సహనంతో ఉన్నాము. కానీ ఉద్యోగులు మా నిర్ణయంపై సూత్రప్రాయ వైఖరిని కనబరుస్తున్నారు. దీనిపై సిబ్బందికి చివరి కమ్యునికేషన్‌ను పంపాము. సంస్థ ఆదేశాలను పాటించని వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది' అని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) NG సుబ్రమణ్యం తెలిపారు.
'సాంకేతికత విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో సైబర్ అటాక్‌ల వల్ల సంస్థ అనుకోకుండా ఇబ్బందుల్లో పడవచ్చు. ఇంటి నుంచి పనిచేసేటప్పుడు అలాంటి నియంత్రణలు ఉండవు. కాబట్టి వ్యాపారానికి భద్రతాపరమైన ప్రమాదాలు సంభవించవచ్చు. కొవిడ్ సమయంలో ఎలాంటి ఆఫ్‌లైన్ ఇంటరాక్షన్ లేకుండా దాదాపు 40 వేల మంది ఆన్‌లైన్‌లోనే రిక్రూట్ చేసుకోబడ్డారు. వారు అలాగే నిష్క్రమించారు కూడా. ఈ తరహా ప్రాక్టీస్ ఏ సంస్థకూ ఉపయోగపడదు' అని వెల్లడించారు.


Click it and Unblock the Notifications