ఇటీవల టీసీఎస్ (TCS) ప్రకటించిన ఉద్యోగ తొలగింపులపై ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర కార్మిక శాఖ చర్యలకు దిగింది. కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుండటంతో, ఆగస్ట్ 6న టీసీఎస్‌కు కౌన్సిలేషన్ (సమాధాన) సమావేశానికి హాజరుకావాలని కార్మికశాఖ ఆహ్వానించనుంది.

అసలు విషయం ఏంటి?
TCS ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో (FY26) దాదాపు 2% ఉద్యోగులను తొలగించనుందని, అంటే సుమారు 12,200 మంది ఉద్యోగాలు పోవచ్చని ఇటీవల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా మిడిల్స్, సీనియర్ ఉద్యోగులపై ఇది ప్రభావం చూపబోతోంది. దీనిపై కర్ణాటక రాష్ట్ర IT/ITeS ఉద్యోగుల యూనియన్ (KITU) కార్మికశాఖకు ఫిర్యాదు చేసింది.
నిబంధనల ఉల్లంఘన?
కర్ణాటక రాష్ట్ర IT/ITeS ఉద్యోగుల యూనియన్ (KITU) ప్రతినిధులు జులై 30న అదనపు కార్మిక కమిషనర్ జి.మంజునాథ్‌ను కలసి, ఈ లేఅఫ్ చర్యలు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, 1947 నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఈ చట్టం ప్రకారం, 100 మందికంటే ఎక్కువ ఉద్యోగులున్న కంపెనీలు ఉద్యోగుల తొలగింపులకు ముందు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అలాగే ఉద్యోగుల రికార్డులు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి.
యూనియన్ వాదన ప్రకారం, టీసీఎస్ ఈ నిబంధనలను పక్కనపెట్టి ఉద్యోగులకు రాజీనామా చేయమని బలవంతం చేయడం ద్వారా "క్రిమినల్" చర్యలు తీసుకుంటోంది.
ఇదే సమయంలో మరో యూనియన్ అయిన NITES (The Nascent Information Technology Employees Senate) కూడా సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యాలయానికి రెండు లేఖలు పంపింది. వారు కూడా ఈ విషయంపై కేంద్ర కార్మిక శాఖ జోక్యం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో TCS సీనియర్ అధికారులు ఆగస్ట్ 1న కేంద్ర కార్మిక కమిషనర్ ముందు హాజరుకావాలని సమన్లు జారీ అయ్యాయి.
TCS తీసుకుంటున్న పెద్దసంఖ్యలో ఉద్యోగాల తొలగింపు నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ రెండు స్థాయిలలో - రాష్ట్ర, కేంద్ర స్థాయిలో - అధికారులను కలుస్తున్నాయి. ఉద్యోగుల హక్కులు కాపాడే దిశగా ఈ సంఘాల పోరాటం కొనసాగుతుంది.
ఈ చర్యల వెనుక అంతర్జాతీయ పరిస్థితులు మరియు వ్యాపార వ్యూహాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించేందుకు, అలాగే వేగంగా ఎదుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీకి మారేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో టెక్ రంగంపై ఖర్చులు తగ్గుతున్న కారణంగా ప్రాజెక్టుల సంఖ్య కూడా తగ్గుతోంది. ఈ పరిణామాల ప్రభావంగా, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు మిడిల్ మరియు సీనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
More From GoodReturns

Layoffs: కోడింగ్ చేసే రోజులు పోయాయా? లేఆఫ్స్ భయాల మధ్య TCS సీఈఓ కీలక వ్యాఖ్యలు!

Layoffs: ఏఐ మీ ఉద్యోగాన్ని లాగేసుకుంటుందా లేక మిమ్మల్ని బాస్‌ను చేస్తుందా?

TCS ఉద్యోగులకు తీపి కబురు.. ఏప్రిల్ 1 నుంచి జీతాల పెంపు! ఏ గ్రేడ్ వారికి ఎంతంటే?

జోహో ఉద్యోగుల తొలగింపు: ఆ 300 మందికి ఏం జరిగింది?

Stock Market: సెన్సెక్స్ టాప్ లూజర్స్ ఇవే.. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలా, లేక ఇన్వెస్ట్ చేయాలా?

TCS Q4 FY26 Results: టీసీఎస్ క్యూ4 ఎఫ్వై26 ఫలితాలు ఇవిగో.. భారీగా పెరిగిన లాభాలు..డివిడెండ్ ఎంతంటే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications