TCS News: టీసీఎస్ ఉద్యోగులకు కొత్త సమస్య.. ఆఫీసులకు వెళ్లినా కష్టాలు తప్పట్లే.. పాపం..!!
TCS News: దేశంలో అతిపెద్ద టెక్ దిగ్గజం టీసీఎస్. ఈ కంపెనీలో దాదాపు 6 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంత పెద్ద కంపెనీ ఇటీవల తన ఉద్యోగులను ఇకపై తప్పకుండా ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సిందే అని హుకుం జారీ చేసింది.
ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు సమస్యలు ఇప్పుడే మెుదలైనట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటి దాకా ఒకరకమైన కష్టాలను ఎదుర్కొన్న టీసీఎస్ టెక్కీలు, తాజాగా ఆఫీసులకు తిరిగి వెళ్లి కొత్త కష్టాలను చూస్తున్నారు. అవును ఆఫీసుల్లో ఉద్యోగులకు తగినన్ని ఖాళీలు అంటే సీట్లు లేవని తెలుస్తోంది. దీంతో చాలా మంది ఆఫీసులకు వెళ్లి పనిచేసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. తగినన్ని సీటింగ్ ఏర్పాటు లేకపోవటం ఆఫీసుల్లో కొత్త పోరాటానికి కారణమైంది. కేటాయించిన సీట్లపై ఆఫీసుల్లో గందరగోళం ఏర్పడింది.

టెక్ దిగ్గజం టీసీఎస్ గత రెండేళ్లలో దాదాపు లక్ష మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. అలాగే టీసీఎస్ లో ఉండే అకేషనల్ ఆక్యుపెన్సీ జోన్స్(OOZ) సూచించే వాటిని కంపెనీ తొలగించడం వల్ల సమస్య జటిలమైంది. ఈ ప్లగ్-అండ్-ప్లే సౌకర్యాలు సిబ్బందికి తాత్కాలిక సీటింగ్ ఏర్పాట్లను అందించడానికి రూపొందించబడినవి. OOZలకు యాక్సెస్ నిలిపివేయడంతో, కొంతమంది ఉద్యోగులు హాళ్లు, లాబీలు, కారిడార్లు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది చాలా మంది ఉద్యోగులకు అసౌకర్యాన్ని కలిగిస్తోందని సమాచారం.
దీనికి తోడు టీసీఎస్ తన ఉద్యోగులకు తమ నివాసాలకు దగ్గరలోని ఆఫీసులకు వెళ్లేందుకు అవకాశం లేకుండా కంపెనీ కేటాయించిన కార్యాలయాలకు తిరిగి రావాలని కంపెనీ నిర్దేశించడం ఉద్యోగులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అయితే ఉద్యోగులు ఎక్కడైతే నియమితులయ్యారో అదే ఆఫీస్ నుంచి పని చేయాలని.. లేకుంటే వారికిచ్చే సిటీ అలవెన్స్ కోల్పోవాల్సి ఉంటుందని టీం మేనేజర్లు చెబుతున్నట్లు కొందరు టెక్కీలు వెల్లడించారు. టీసీఎస్ ప్రస్తుతం టైర్-1 నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు నెలకు రూ.2,000-3,000 సిటీ అలవెన్స్ చెల్లిస్తోంది. మెుత్తానికి కంపెనీ హెచ్ ఆర్ టీమ్ ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications