జీతాల్లో కోత.. బోనస్ కి రాంరాం.. టీసీఎస్ కంపెనీలో ఉద్యోగుల కష్టాలు అన్నీ ఇవన్నీ కావు...

ఒక ఉద్యోగి బోనస్ సమయం వస్తుంది అంటే శుభవార్త. కానీ అదే బోనస్ చేతికి రాకపోతే. ఇప్పుడిప్పుడే బాధ్యతలు పెరుగుతున్న తరుణంలో, ఏడాది పొడవునా శ్రమించి, ఆఖరికి బోనస్ రూపంలో వచ్చింది దానికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందనుకోవడం సహజం. కానీ ఇటీవల టీసీఎస్‌లోని చాలా మంది ఉద్యోగుల ఎదురైన అనుభవం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఆశించిన బోనస్ రాకపోవడం, లేదా గణనీయంగా తగ్గిపోవడంతో వారు నిరాశకు లోనవుతున్నారు. ఇలా జరగడం వల్ల చాలా మంది ఉద్యోగులు లోపల భాధపడుతూ నిరాశను బయటకు వ్యక్తం చేస్తున్నారు.

TCS bonus cut QPB issue IT employee dissatisfaction salary transparency AIITEU protest performance bonus dispute TCS latest news TCS QPB AIITEU

ఇటీవల టీసీఎస్‌లో (TCS) ఉద్యోగుల మధ్య పెరుగుతున్న అసంతృప్తి ఓ సీరియస్ చర్చాంశంగా మారింది. టాటా గ్రూప్‌కి చెందిన ఈ ఐటీ సంస్థ, జీతాలు మరియు బోనస్ వ్యవహారాల్లో తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు ఉద్యోగులలో గందరగోళాన్ని కలిగిస్తున్నాయి.

ప్రధానంగా సీనియర్ ఉద్యోగులకు ఇచ్చే క్వార్టర్లీ వెరీబుల్ అలవెన్స్ (QVA) విషయంలో భారీ కోతలు కనిపిస్తున్నాయి. గత మూడు క్వార్టర్లుగా కొంతమందికి కేవలం 20 నుంచి 30 శాతం మాత్రమే ఇవ్వబడినట్లు తెలుస్తోంది. అంటే, అసలు రావాల్సిన మొత్తంలో దాదాపు 70 శాతం వరకూ కోత పడిందన్న మాట. ఇది ఉద్యోగులలో గట్టిగా స్పందన తీసుకువచ్చింది.

ఇక జీతాల్లో వచ్చే బోనస్ లెక్కలు కూడా చాలా మందికి అర్థంకావడం లేదు. సంస్థ ప్రాజెక్ట్ పనితీరు, టార్గెట్లు, బిలివబులిటీ వంటివి ఆధారంగా బోనస్ నిర్ణయిస్తున్నప్పటికీ, అసలు లెక్కలు ఏమిటో చెప్పకపోవడం వల్ల ఉద్యోగులకి ఇది అవమానంగా అనిపిస్తోంది.

దీనికితోడు, వేతన సమీక్షలు ఆలస్యం కావడం, ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని తగ్గించి బలవంతంగా ఆఫీసుకు రమ్మని ఒత్తిడి చేయడం వంటివి ఉద్యోగులపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి.

కంపెనీ వాదన ప్రకారం, ఎక్కువమందికి (సుమారు 70 శాతం ఉద్యోగులకు) పూర్తి QVA అందించామని చెబుతోంది. మిగిలిన వారికి మాత్రం యూనిట్ పనితీరు ఆధారంగా తగ్గించినట్టు చెప్పింది. కానీ, ఇది నిజంగా ఉద్యోగులకి న్యాయం జరిగిందా అన్న ప్రశ్న మాత్రం నిలిచేలా ఉంది.

ఈ నేపథ్యంలో, టీసీఎస్ సంస్థ ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే పారదర్శకతతో కూడిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగుల శ్రమకు గౌరవం ఇవ్వకపోతే, అది సంస్థపై ప్రభావం చూపించే పరిస్థితిని తేవడం ఖాయం.

యూనియన్ ముందుకు వచ్చింది:
AIITEU (ఆల్ ఇండియా ఐటి & ఐటి ఇఎస్ ఉద్యోగుల సంఘం) ఈ పరిణామాలపై స్పందించింది. సంస్థలు ఉద్యోగులను ఎలా వినియోగించుకుంటున్నాయనే దానిపై వాదన తీసుకొచ్చింది. జీతాల్లో కోతలు, క్వార్టరలి బోనస్(QPB)ను పూర్తిగా ఇవ్వకపోవడం, వేరియబుల్ పేలో అన్యాయం వంటి అంశాలపై కూడా AIITEU మాట్లాడింది. TCS తమ ఉద్యోగులపై వ్యూహాత్మకంగా దుర్వినియోగం చేస్తోంది అంటూ AIITEU ప్రధాన కార్యదర్శి సౌభిక్ భట్టాచార్య స్పష్టంగా తెలిపారు.

ఒక ఉద్యోగి జీవితంలో మోటివేషన్ అంటే కేవలం జీతం కాదు - గౌరవం, పారదర్శకత, గుర్తింపు అన్నీ ముఖ్యం. ఏ సంస్థ అయిన దాని శ్రేయస్సు, ఉద్యోగుల మీదే ఆధారపడి ఉంటుంది. అలాంటి ఉద్యోగుల ఆశలను పగిలిపోకుండా చూసుకోవడం అనేది మేనేజ్‌మెంట్ బాధ్యత.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+