ఒక్క మెయిల్‌తో జీతాల్లో 80% వరకు పెంపు అని ఉద్యోగులకు ఆశలు కలిగించిన TCS!
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగుల జీతాల్లో భారీగా 80% పెంపు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగుల ఆశలు, ఆకాంక్షలకు శుభవార్తగా మారింది.

ఈ జీతాల పెంపు నిర్ణయం ఆగస్టు 6న ఉద్యోగులకు పంపిన సంస్థ పంపిన ఆంతరంగిక మెయిల్ ద్వారా తెలియజేశారు. ఈ మెయిల్‌ను TCS మానవ వనరుల శాఖ మాజీ అధిపతి మిలింద్ లక్కడ్ మరియు కొత్త CHRO కె. సుదీప్ కలిసి పంపించారు. ఇందులో, C3A గ్రేడ్ వరకు ఉన్న అన్ని స్థాయి ఉద్యోగులకు ఈ వేతన పునఃసమీక్ష వర్తించనుందని పేర్కొన్నారు. అంటే, మిడ్ లెవెల్ మరియు జూనియర్ స్థాయి ఉద్యోగులకు ఇది ఒక పెద్ద ఊరట అని చెప్పవచ్చు. "మీరు చూపిస్తున్న కష్టపడే విధానం, సమర్పణ, నిబద్ధతకు ధన్యవాదాలు. మనమందరం కలిసి TCS భవిష్యత్తును నిర్మించుకుందాం," అని మెయిల్‌లో పేర్కొన్నారు.
ఇది ఒకవైపు ఆనందం కలిగించే విషయంగా ఉన్నా, మరోవైపు TCS ఈ ఏడాది మొత్తం 12,000 ఉద్యోగాలను తొలగించనున్నట్టు సమాచారం. అంటే దాదాపు సంస్థ మొత్తం మానవ వనరులలో 2% ఉద్యోగాలు తగ్గించనున్నట్లు. ఈ తొలగింపులు మధ్యస్థ మరియు సీనియర్ స్థాయి ఉద్యోగులపై ఎక్కువగా ప్రభావం చూపనున్నాయి. సంస్థ తన భవిష్యత్తు అవసరాలకు తగినట్లు తయారవ్వాలనే ఉద్దేశంతో కొన్ని ముఖ్యమైన మార్పులు చేస్తోంది. ఇందులో AI, క్లౌడ్, కొత్త మార్కెట్లు, తదితర రంగాల్లో పెట్టుబడులు పెరగడం కూడా ఉంది.
"కొంతమంది ఉద్యోగుల స్కిల్ల్స్‌కు తగిన ప్రాజెక్ట్లు లేవు. అందుకే కొన్ని ఉద్యోగాల నుంచి వ్యక్తులను తప్పనిసరిగా పంపాల్సి వస్తోంది," అని సంస్థ వివరించింది.
TCS సహా ఇతర టాప్ IT కంపెనీలు ప్రస్తుతం అర్థిక మందగమనం, యుద్ధాలు, ట్రేడ్ వార్లు, టెక్నాలజీ మార్పులు వంటి గ్లోబల్ సమస్యలతో పోరాడుతున్నాయి. FY26 మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆదాయ వృద్ధి అతి తక్కువ స్థాయిలో ఉంది. ఇదే విషయాన్ని గత ప్రెస్ మీట్‌లో వెల్లడిస్తూ, కస్టమర్ల నుంచి వచ్చే ప్రాజెక్టులలో నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయనీ, వ్యాపారాలు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయనీ చెప్పారు.
ఈ పరిణామాలు వలన, ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు తమ నైపుణ్యాలను ఆధునీకరించుకోవడం అత్యవసరం. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్, జెనెరేటివ్ ఎఐ, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో స్కిల్స్‌ను పెంచుకోవాలి.
ఇటువంటి పరిణామాలు TCSతో పాటు మొత్తం ఇండియన్ IT రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాల్సిన విషయం. ఒకవైపు వేతన పెంపుతో ఉద్యోగులకు ఊరట కలిగిస్తూ, మరోవైపు ఉద్యోగుల తొలగింపులతో ఒత్తిడిలోనూ పడేసిన TCS వ్యూహం పై ప్రశ్నలు తప్పవు. సంస్థల అభివృద్ధికి ఉద్యోగుల పాత్ర కీలకం. మరి, సంస్థల ఆర్ధిక వ్యూహాలలో వారు ఎలాంటి స్థానం దక్కించుకుంటారన్నది ఇప్పుడు ప్రధాన చర్చాంశం.


Click it and Unblock the Notifications