దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇంకా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాలరీ ఇంక్రిమెంట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఆలస్యం కావడం ఉద్యోగుల్లో భవిష్యత్ భద్రతపై సందేహాలు, ఆందోళనలకు దారితీస్తోంది.

TCS మానవ వనరుల విభాగం మిలింద్ లక్షద్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి, క్లయింట్ డీల్ వాయిదాలు, ఒప్పందాల ఆలస్యం వంటి అంశాల వల్ల సాలరీ రివిజన్ గురించి తుది నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారిందని తెలిపారు.
అదనంగా, సంస్థ CEO కృష్ణివాసన్ మాట్లాడుతూ, ''మేము ఉద్యోగుల కష్టాన్ని గుర్తిస్తున్నాం. కానీ వేతనాల పెంపు వంటి ముఖ్యమైన అంశంపై స్పష్టత ఉన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం మార్కెట్‌లో కొన్ని అనిశ్చితులు ఉన్నాయ''ని చెప్పారు.
ప్రతిసారి TCS సాధారణంగా ఏప్రిల్ 1న జీత పెంపు ప్రక్రియను, ఉద్యోగులకు సాలరీ ఇన్క్రిమెంట్లు ప్రకటిస్తూ ఉంటుంది. కానీ ఈ ఏడాది కంపెనీ అలా చేయలేదు. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో, ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు.
ప్రస్తుతం TCSలో పనిచేస్తున్నవారిలో ముఖ్యంగా మధ్యస్థాయి మరియు జూనియర్ లెవల్ ఉద్యోగులు ఈ ఆలస్యం ఇబ్బందిని వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా కంపెనీ ఆదాయం పెరిగినప్పటికీ, సేలరీ హైక్స్ విషయంలో ఆలస్యం జరగడం వారి ఆర్థిక భద్రతపై ప్రభావం చూపిస్తోంది.
ఈ త్రైమాసికంలో కంపెనీ 5,090 ఉద్యోగులను నెట్‌గా నియమించింది. మొత్తం హెడ్‌కౌంట్ 6,13,069కి చేరింది. కానీ గత సంవత్సరం తీసుకున్న 42,000 కొత్త ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను పూర్తిగా జాబితాలోకి తీసుకోవడంలో కంపెనీకి ఇబ్బంది ఎదురవుతోంది. దీనివల్ల భవిషత్తులో నియామకాలపై పడుతుంది.
తక్కువ ఆదాయ వృద్ధి ఉన్నప్పటికీ, TCS దీర్ఘకాలిక ప్రణాళికపై దృష్టి పెట్టింది. కానీ తాత్కాలికంగా జీతాలు, ఉద్యోగ నియామకాలు వంటి అంశాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఇలా, TCS జీత పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయడం భారత ఐటీ రంగంలో పెద్ద హెచ్చరికగా భావించవచ్చు. ఇది ఇతర కంపెనీలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications