ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) జూన్ త్రైమాసికం ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది.ఈ త్రైమాసికంలో రూ.9,478 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక లాభం రూ.9,008 కోట్లతో పోలిస్తే ఇది 5.2 శాతం అధికం. టీసీఎస్ ఫలితాలతో పాటు తన వాటాదారులకు ప్రతి ఈక్విటీ షేరుకు 1 రూపాయి ముఖ విలువ కలిగిన ₹8 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. మధ్యంతర డివిడెండ్ ఆగస్టు 3, 2022న చెల్లిస్తారు. దీనికి జూలై 16, 2022 రికార్డ్ డేట్ గా నిర్ణయించారు.
8.2 బిలియన్ డాలర్లకు చేరిన ఆర్డర్లు
జూన్ త్రైమాసికానికి కంపెనీ ఆర్డర్లు 8.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో 400 మిలియన్ డాలర్లకు పైబడిన 2 భారీ ఆర్డర్లతో పాటు, 100 మిలియన్ డాలర్లకు పైబడినవి తొమ్మిది, 50 మి. డాలర్లపైన ఆర్డర్లు 19 ఉన్నాయని పేర్కొంది. భవిష్యత్‌లో 100 కోట్ల డాలర్లకు పైబడ్డ ఒప్పందాలు జరగొచ్చని సీఓఓ గణపతి సుబ్రమణియమ్ అభిప్రాయపడ్డారు. ఈ త్రైమాసికంలో నికరంగా 14,136 మంది ఉద్యోగులను చేర్చుకుంది.

లాభదాయకత ఈసారి తక్కువగా ఉన్నా
UK మార్కెట్ 12.6 శాతం వృద్ధిని సాధించింది, కాంటినెంటల్ యూరప్ 12.1 శాతం పెరిగింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో లాటిన్ అమెరికా 21.6 శాతం, భారత్ 20.8 శాతం, ఆసియా-పసిఫిక్ 6.2 శాతం, మిడిల్ ఈస్ట్ & ఆఫ్రికా 3.2 శాతం పెరిగాయి.లాభదాయకత ఈసారి తక్కువగా ఉన్నా, భవిష్యత్తులో మెరుగ్గా ఉంటుందనే ధీమాను ఎండీ వ్యక్తం చేశారు. వ్యయ నిర్వహణ విషయంలో తొలి త్రైమాసికం సవాళ్లు విసిరిందని సీఎఫ్‌ఓ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications