IT News: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ.. అనేక మంది ఉపాధికి ప్రమాదం పొంచి ఉందని టెక్కీలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ అందుబాటులోకి రావటం పెరిగింది.
వీటికి సంబంధించిన ప్రశ్నలకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గణపతి సుబ్రమణ్యం బదులిచ్చారు. కృత్రిమ మేధస్సు ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతుందన్న ఆయన.. దీనిపై టెక్కీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

కృత్రిమ మేధస్సు కొత్తది కాదన్న గణపతి.. దీనిపై తాము 1990ల నుంచి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందటంతో పాటు చాలా మంది వీటికి ఉపయోగిస్తున్నారని అన్నారు. తనతో పాటు తన పిల్లలు సైతం దానిని ఉపయోగించుకునే స్థాయికి అవి అందుబాటులోకి వచ్చాయన్నారు. AI ప్రస్తుతం ఐటీ సిబ్బంది కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందని సీఓఓ గణపతి సుబ్రమణ్యం వెల్లడించారు.
అనేక ప్రొడక్టుల్లో కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నామని గణపతి అన్నారు. ఉదాహరణకు TCS BaNCS ప్లాట్‌ఫారమ్‌లో 90 శాతం కోడ్ ప్రాంప్ట్‌లను చేసింది. మేము అధిక నాణ్యత ప్రాంప్ట్‌లతో అధిక నాణ్యత స్పెసిఫికేషన్‌లతో కోడ్ రూపొందించిన విషయం టీసీఎల్ లోని IT సిబ్బంది తెలిపారు. టీసీఎస్‌కు ఏఐ కొత్తేమీ కాదని అన్నారు.

ఇంజినీరింగ్ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నకు టీసీఎస్ సీఓఓ గణపతి సుబ్రమణ్యం బదులిస్తూ.. ప్రస్తుతం ఐటీ ఇంజనీర్లు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఉద్యోగులు చేసే పనిలో ఏఐని వినియోగించడం వల్ల ఉద్యోగుల సామర్థ్యం మెరుగుపడిందని అన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications